
పోలయ్య కుటుంబసభ్యులకు పరామర్శ
కావలి: ఇటీవల మృతి చెందిన పట్టణానికి చెందిన ఆరో వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ ఏడుంబాక పోలయ్య కుటుంబసభ్యులను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. పోలయ్య నివాసంలో చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కేన్సర్ బాధిత బాలుడికి ఆర్థిక సాయం
కేన్సర్‌తో బాధపడుతున్న మద్దూరుపాడుకు చెందిన పీ కళ్యాణ్ కుమార్ అనే బాలుడికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.25వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీ మేకపాటి పీఎం రి లీఫ్ ఫండ్ నుంచి వైద్యం కోసం రూ.25వేలు చెక్ మంజూరు చేయించి అందజేసారు.