
పీవీ ఘాట్ ప్రతిపాదన పరిశీలనలో ఉంది
ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు మెమోరియల్ ఘాట్ నిర్మించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి ఎస్‌హెచ్ బాబుల్‌సుప్రియో తెలిపారు. న్యూఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ బంగళాలను స్మారక ప్రదేశాలుగా మార్చకూడదన్న నిబంధన కారణంగా మాజీ ప్రధాని చరణ్‌సింగ్ ఉన్న నివాసాన్ని స్మారక ప్రదేశంగా మార్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్టు పేర్కొన్నారు.