జగన్, విజయమ్మ రాజీనామా | YS Jagan, YS Vijayamma resign over Telangana | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 10 2013 5:56 PM | Last Updated on Wed, Mar 20 2024 3:58 PM

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కడప లోక్సభ సభ్యత్వానికి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వారు ఇద్దరూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసినట్లు ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన రెడ్డి రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్కు ఫాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ విధానాలకు నిరసనగా వారు రాజీనామా చేసినట్లు తెలిపారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్, విజయమ్మ ఆరు పేజీల లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడులుపోతోంది, దానికి తాము నిరసన తెలియజేస్తున్నామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి చెప్పారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు. ఏ పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తాము కోరుతున్నట్లు తెలిపారు. పరిష్కారం చూపిన తరువాతే రాష్ట్రాన్ని విభజించాలని తాము ఎప్పుడో చెప్పినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడులుపోతోంది, దానికి తాము నిరసన తెలియజేస్తున్నామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి చెప్పారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు. ఏ పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తాము కోరుతున్నట్లు చెప్పారు. పరిష్కారం చూపిన తరువాతే రాష్ట్రాన్ని విభజించాలని తాము ఎప్పుడో చెప్పినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో వైఎస్ఆర్ సిపిది ఒకటే విధానం అని చెప్పారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలనే పది రోజుల తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement