బడ్జెట్ నిరాశ పరిచింది: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఎంతో చేస్తారని ఆశించామని, అయితే బడ్జెట్ నిరాశపర్చిందని వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుకతో కలసి ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడారు. రైల్వే బడ్జెట్ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని.. ఉమ్మడి ఏపీకి సంబంధించి దాదాపు రూ.29 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ‘‘అవన్నీ ఈ బడ్జెట్‌లో చేరుస్తారనుకున్నాం. ఏపీకి ఆరునెలల్లోనే కొత్త రైల్వేజోన్ ఇస్తామని విభజన చట్టంలో ఉన్నా దాని ఊసే లేదు.’’ అని అన్నారు.