ఎంపి మేకపాటి
నెల్లూరు: రాజకీయ నిరుద్యోగుల వల్లే రాష్ట్ర విభజన సమస్య వచ్చిపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి అన్నారు. ఏపీ ఎన్జీవోల నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు నేతలు
ఉత్తుత్తి రాజీనామాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మేకపాటి డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఏపి ఎన్జీఓలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈరోజు నుంచి వారు సమ్మె మొదలు పెట్టారు. వారి సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.