అంబేద్కర్ ఆశయాలను అమలుచేయడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: అంబేద్కర్ ఆశయాలను అమలుచేయడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన లోక్ సభలో అంబేద్కర్ సేవలను ఉద్దేశించి మాట్లాడారు.
దళితులు, ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంతా నడుంకట్టాలని చెప్పారు. కేవలం ఆయన విధానాలు పెడితే సరిపోదని, వాటిని తప్పక అమలు చేయాలని సభలో గుర్తు చేశారు.