నెల్లూరు సిటీ: ఆంధ్రుల హక్కులను కేంద్ర ప్రభుత్వం వద్ద సీఎం చంద్రబాబు తాకట్టుపెట్టారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్‌మోపూర్‌లో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎంపీ మేకపాటి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.
ప్రత్యేకహోదా, దుగ్గరాజుపట్నంపోర్టు, కడప ఉక్కుఫ్యాక్టరీతో పాటు అనేక అంశాలను విశ్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తప్పిదాల కారణంగా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో స్వర్ణయుగంగా నడిచిందన్నారు. సమయానికి వర్షాలు రావడం, పంటలు సజావుగా పండటం ద్వారా రాష్ట్ర ప్రజులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన నాలుగేళ్లలో వర్షాలు సక్రమంగా పడిన పరిస్థితి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment