
విజయకుమార్ స్ఫూర్తితో వైద్యం అందించాలి
నెల్లూరు ఎంపీ మేకపాటి
నెల్లూరు(అర్బన్): ప్రజా ఉద్యమాలతో పాటు మంచి వైద్య సేవలందించి ప్రజా వైద్యుడు అనిపించుకున్న వ్యక్తి డాక్టర్ జి. విజయకుమార్ అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. డాక్టర్ విజయకుమార్ ప్రధమ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక మద్రాసు బస్టాండ్ సమీపంలోని డాక్టర్ జీవీకే మెమోరియల్ ట్రస్ట్ నె ల్లూరు ఆసుపత్రిలో శనివారం సభ జరిగింది. డాక్టర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆసుపత్రి ట్రస్ట్ వారు ప్రవేశపెట్టిన కుటుంబ ఆ రోగ్య కార్డును ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విజయకుమార్ స్ఫూర్తితో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కోరారు.
భారీ ర్యాలీ..
డాక్టర్ విజయకుమార్ అభిమానులు, ప్రజాఉద్యమాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్‌టీసీ, మద్రాసు బ స్టాండ్, వీఆర్‌సీ మీదుగా తిరిగి నెల్లూరు ఆసుపత్రి వరకు సా గింది. సభకు అధ్యక్షత వహించిన నిజామాబాద్‌కు చెందిన సీనియర్ జనవిజ్ఞానవేదిక నాయకులు డాక్టర్ రామమోహన్‌రావు మాట్లాడారు. ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ జయకుమార్, వైద్యులు డాక్టర్ బ్రహ్మారెడ్డి, డాక్టర్ రామారావు, సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల నాయకులు జె.కిశోర్‌బాబు, గాలి శ్రీనివాసులు, మాల్యాద్రి, నూనె నారాయణ పాల్గొన్నారు.