'రైతులకు నష్టపరిహారం చెల్లించాలి' | ysrcp leaders Visitation to Flood Victims | Sakshi
Sakshi News home page

'రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'

Published Thu, Nov 19 2015 5:34 PM | Last Updated on Thu, Aug 9 2018 4:39 PM

ysrcp leaders Visitation to Flood Victims

కోవూరు: గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన జీవనానికి తీవ్ర ఇబ్బందులు గురి చేసింది. వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. కోవూరు మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు గురువారం రైతులను పరామర్శించారు.

ఎనమడుగు గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న 300 ఎకరాల తమలపాకు తోటను నేతలు పరిశీలించారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే  నష్టం పరిహారం ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.    


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement