ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలి
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
చేజర్ల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యలపై అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. మరుగుదొడ్ల బిల్లుల ఆలస్యంపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తానన్నారు. శ్మశానవాటికల అభివృద్ధికి ఉపాధి కింద రూ.10 లక్షలు మంజూరు చేశామన్నారు. పింఛన్ల పంపిణీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకపై నెలకొన్న గందరగోళానికి త్వరలో కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించనున్నట్లు చెప్పారు.
జెడ్పీ నిధులతో జిల్లా అభివృద్ధి: -జడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
జిల్లా పరిషత్ నిధులతో జిల్లా అభివృద్ధి చేస్తామని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. విద్యాశాఖకు 75 శాతం నిధులు కేటాయించి పాఠశాలలు, హాస్టళ్లపై దృష్టి సారిస్తానన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి రూ.40 లక్షలతో ప్రతి స్కూల్‌కు ఓ కంప్యూటర్, బోధించేందుకు టీచర్‌ను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పింఛన్లు అందేలా కృషి చేయాలన్నారు. రాబోయే వేసవిలో జిల్లాలో ఎక్కడ నీటి సమస్య ఉన్నా తన నిధులతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో చేజర్ల ఎంపీపీ ధనలక్ష్మి, జెడ్పీటీసీ సల్మాషరీన్, ఎంపీడీఓ వాణి, తహశీల్దార్ రేవతి, వైఎస్సార్ సీపీ నాయకులు కొమ్మి సిద్దులు నాయుడు, తలపనేని జయంతులునాయుడు, రామమనోహర్‌రెడ్డి, రాఘవరెడ్డి, శేఖర్‌రెడ్డి, సుబ్బానాయుడు పాల్గొన్నారు.