
కుట్రలు చెల్లవ్
మేమంతా జగన్ సైన్యం
► టీడీపీ దుష్ర్పచారాన్ని తిప్పికొట్టిన నేతలు
► జగన్ కోసం కదలివచ్చిన మహిళలు, రైతులు
► జనంలో అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం
► వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తిన నెల్లూరు
సాక్షి ప్రతినిధి,నెల్లూరు: మేమంతా జగన్ సైన్యమంటూ మరోసారి నిరూపించా రు. టీడీపీ నేతలు చేస్తున్న దుష్ర్పచారంపై మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్ర లు చేసినా.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు మరోసారి స్పష్టం చేశారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన భారీ బహిరంగసభ వైఎస్సార్‌సీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. టీడీపీ చేస్తున్న విషప్రచారాన్ని జగన్‌మోహన్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు తిప్పికొట్టారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే నాయకులం కా దని జిల్లా నేతలు ప్రకటించారు.
జగన్‌మోహన్‌రెడ్డి కోసం నెల్లూరురూరల్ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి జనం భారీ గా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి జనం తరలి రావటంతో నగరంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాక్టర్లు, ఆటోలు, వాహనాల్లో భారీగా కస్తూరిదేవి గార్డెన్‌కు చేరుకున్న జనం జైజగన్ నినాదాలతో హోరెత్తించారు. రేణిగుంట నుంచి నెల్లూరుకు పయనమైన జగన్‌మోహన్‌రెడ్డికి దారిపొడవునా అపూర్వ స్వాగతం లభించింది. సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్ వారి నియోజకవర్గాల్లో ఘనస్వాగతం పలికారు.
అదేవిధంగా జిల్లా యువజన విభాగం, విద్యార్థి విభాగం అధ్యక్షులు రూప్‌కుమార్‌యాదవ్, శ్రావణ్‌కుమార్ బోదనం టోల్‌ప్లాజా వద్ద పెద్దఎత్తున స్వాగతం పలికారు. అదేవిధంగా నెల్లూరు నగరపార్టీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు తన అనుచరులతో స్వాగతం పలికారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్‌లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆనం విజయకుమార్‌రెడ్డి, కుమారుడు కార్తికేయరెడ్డి ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు.
దివంగత సీఎం వైఎస్‌ఆర్‌పై ఉన్న అభిమానాన్ని మరోసారి నిరూపించుకున్నారు. యువనాయకుడు కార్తికేయరెడ్డి మాట్లాడుతూ.. 2019లో వైఎస్ జగన్ సీఎంను చేయటమే లక్ష్యమంటూ బహిరంగసభకు వచ్చిన యువత చేత నినాదాలు చేయించారు.
ఆ చిరునవ్వు కోసం ఎంతదూరమైనా...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో చెదరని చిరునవ్వును చూసి నాయకులు, ప్రజలు పులకించిపోయారు. ఆ చిరునవ్వు కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటామని నాయకులు ప్రకటించారు. గత ఎన్నికల్లో జిల్లా ప్రజలు పార్టీకి ఎటువంటి బ్రహ్మరథం పట్టారో... అదే అభిమానం ఇప్పటికీ చూపుతున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రసంగించటంతో జనం పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. టీడీపీ అధినేత సూచనతో పచ్చరాతలు రాస్తున్న పత్రికలపై పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ కారణంగా లబ్ధిపొందిన నేతలు టీడీపీ పంచనచేరి వైఎ స్సార్‌సీపీని విమర్శించటంపై ఆగ్రహంవ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీకి రోజు రోజుకు ప్రజల్లో మద్దతు పెరుగుతోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్ మాట్లాడుతున్నంత సేపు సభలో యువత జైజగన్ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. నాటి నుంచి నేటి వరకు తాను ప్రజలు, దేవున్ని నమ్ముతాననటంతో ‘పులిబిడ్డ.. జగన్’ అంటూ నినాదాలు చేశారు.
మొత్తంగా బుధవారం జగన్ పర్యటన శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపిం ది. సీఈసీ సభ్యులు చాలచెన్నయ్య, మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖరరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురమల్లి పద్మనాభరెడ్డి, మేరిగ మురళి, నెల్లూరు నగర డిప్యుటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ పాల్గొన్నారు