
మంత్రి టిజి వెంకటేష్
కర్నూల్ : రాయలసీమకు అన్యాయం జరిగే విధంగా ప్రాజెక్టులు పెండింగులో పెట్టి, తెలంగాణకు అనుకూలంగా జీవో 72 విడుదల చేయడం సీమాంధ్రా ప్రజలకు అన్యాయం చేయడమేనని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. జీవో 72 కు సంబందించి స్పష్టత వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొననని చెప్పారు.
ఏన్జీవోలపై తాను చేసిన వ్యాక్యలను మీడియా వక్రికరించిందన్నారు. ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యమం చాలా గొప్పదని పేర్కొన్నారు. రాష్ట్ర సమైక్య పరిరక్షణ కమిటి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.