సమైక్యాంధ్ర కోసం ఈ నెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు విద్యుత్ జేఏసీ ప్రకటించింది.
విశాఖపట్నం: సమైక్యాంధ్ర కోసం ఈ నెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు విద్యుత్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలోని ఉద్యోగులందరికీ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో వర్క్ టు రూల్ పాటించాలని, 5వ తేదీన సామూహిక సెలవులు పెట్టాలని విద్యుత్ జేఏసీ పిలుపునిచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల ఉద్యోగులు, ఉత్తరాంధ్ర ఉద్యోగులంతా ఈ నెల 7వ తేదీన ఛలో విశాఖ చేపట్టాలని 10వ తేదీన అధికారులకు సహకరించ వద్దని పిలుపు ఇచ్చారు.
11వ తేదీన మొబైల్ సిమ్ కార్డులను యాజమాన్యానికి అప్పగించాలని అప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోతే నిరవధిక సమ్మెలోకి దిగాలోని విద్యుత్ జేఏసీ ప్రతినిధి కెఎన్‌వి రామారావు ప్రకటించారు. గత నెల రోజులుగా విద్యుత్ ఉద్యోగులంతా ఆందోళన కార్యక్రమాల్లో నిరవధికంగా పాల్గొంటున్నారని వారంతా మరింత బాధ్యతగా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా ఆయన కోరారు.