
ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోదు: ఎంపి అనంత
అనంతపురం: రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి చెప్పారు. సీమాంధ్ర నేతల ఒత్తిడితో కేంద్రం వెనక్కి తగ్గుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎంపి వెంకట్రామి రెడ్డి మొదటి నుంచి సమైక్యాంధ్రకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉద్యమ తీవ్రత ఉధృతంగా ఉంది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర జిల్లాలలో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి కూడా అధికంగా ఉంది.