జగన్‌పై కేసు నిలువదని గతంలోనే చెప్పా: గాదె | Already told that Jagan Case not sustain: Gade Venkata Reddy | Sakshi
Sakshi News home page

జగన్‌పై కేసు నిలువదని గతంలోనే చెప్పా: గాదె

Published Tue, Sep 24 2013 3:17 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

జగన్‌పై కేసు నిలువదని గతంలోనే చెప్పా: గాదె - Sakshi

జగన్‌పై కేసు నిలువదని గతంలోనే చెప్పా: గాదె

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డిపై కేసు నిలవదని తాను గతంలోనే చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్‌కు బెయిల్‌ రావడం సంతోషం అన్నారు. మెరిట్స్ ఆధారంగానే బెయిల్‌ వచ్చినట్లు చెప్పారు. ఇందులో కాంగ్రెస్‌ ప్రమేయం ఏమీలేదన్నారు.

క్విడ్‌‌ప్రోకో కేసులో ఆధారాలు లేవని, కేసు నిలువదని గతంలోనే చెప్పానన్నారు.  వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాదని,  ఏనాడు ప్రత్యేక వాదాన్ని ప్రోత్సహించలేదని చెప్పారు. జగన్ కూడ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పార్లమెంట్‌లో ప్లర్డ్ పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమైక్యరాష్ట్రం కోసం పోరాడుతున్న జగన్‌కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని గాదె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement