విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటోంది. అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. విజయనగరం పట్టణంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాం ధ్రకు మద్దతుగా వినూత్న తరహాలో క్వారీ లారీలతో నిరసన వ్యక్తం చేశారు. బాలాజీ జంక్షన్ నుంచి బయలుదేరిన నిరసన ర్యాలీ జేఎన్‌టీయూకే ఇంజినీరింగ్ క్యాంపస్ జంక్షన్ వరకు సాగింది. అనంతరం అక్కడ విజయనగరం-సాలూరు జాతీయ రహదారిపై వంటా వార్పు చేశారు. సమై క్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సోనియా, దిగ్విజయ్, మంత్రి బొత్సల మాస్కులు ధరించిన వ్యక్తులను హోమం వద్ద కూర్చుండబెట్టి వారికి పట్టిన వేర్పాటు వాద భూతం వదలాలంటూ పూజ లు జరిపించారు. వివిధ మత్స్యకార సంఘా ల ఆధ్వర్యంలో 500 మంది మత్స్యకారులు జిల్లాలోని వివిధప్రాంతాల నుంచి జిల్లా కేం ద్రానికి తరలివచ్చి పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో తమ వృత్తిలో భాగంగా రోడ్డుపై వలలు వేసి చేపలు పట్టడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే నదీజలాల సమస్య ఏర్పడుతుందని తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని వాపోయారు.
నిరసనలో భాగంగా బాలాజీ జంక్షన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్‌ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా వీటీ అగ్రహారం ైవె జంక్షన్ వద్ద జాతీయ రహ దారిని దిగ్బంధించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పిలుపుమేరకు అధిక సంఖ్యలో క్రీడాకారులు ప్రధాన కూడళ్లలో క్రీడలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోట జంక్షన్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేశారు. ఉపాధ్యాయ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ మోటార్ ర్యాలీ సైకిల్ ర్యాలీ నిర్వహించగా...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి..అంత్యక్రియలు చేశారు. డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగగా పలువురు పార్టీ నాయకులు, కార్య కర్తలు రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్‌లో గల స్పోర్ట్స్ స్పిరిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు బైక్ ర్యాలీ చేసి కోట జంక్షన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ అద్దె వాహనాల యజమానులు, వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో వాహనాలతో పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్లలో ఆర్‌ఓబీ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం-పాలకొండ రహదారిపై ముగ్గులపోటీ నిర్వహించారు. ఎస్‌కోటలో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త వేచలపు వెంకట చినరామునాయుడు ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్, బొత్స దిష్టిబొమ్మలతో శవయాత్ర చేశారు. అనంతరం దేవీ జంక్షన్‌లో దిష్టిబొమ్మలను దహనం చేశారు.
అలాగే వైఎస్ ఆర్‌సీపీ మద్దతుదారు సర్పంచ్‌లు, నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శ్రీదేవి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేవి జంక్షన్‌లోనే వంటవార్పు జరిగింది. సమైక్యాంధ్ర కోసం బొబ్బిలిలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిం చారు. సాలూరులో బోసుబొమ్మ కూడలిలో తోపుడుబళ్లతో ధర్నా చేపట్టగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించి సమైక్యవాదానికి మద్దతు పలికారు. కురుపాం నియో జకవర్గంలోని గరుగుబిల్లిలో సమైక్యాం ధ్రకు మద్దతుగా వెఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
అన్ని వర్గాల శ్వాస..సమైక్యమే...
Published Mon, Aug 12 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement