Lorry owners association
-
ఇసుక లారీలకు డిపాజిట్టా?
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : లక్షలాది రూపాయలు అప్పులు చేసి, లారీ కొనుక్కొని కిరాయికి తిప్పుకుంటున్న తమను ప్రభుత్వం వేధిస్తోందని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సరఫరాకు తాము ప్రభుత్వానికి ముందస్తుగా ఎందుకు డిపాజిట్ చెల్లించాలని, ఇది ఎవరి నిర్ణయమని నిలదీశారు. పైగా రూ.50 బాండ్ పేపర్‌పై మైనింగ్ శాఖతో అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) చేసుకుని, లారీని కిరాయికి తిప్పుకోవాలా? అని ప్రశ్నించారు. విజయవాడ విద్యాధరపురంలోని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీపై ధ్వజమెత్తుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇసుక రీచ్‌కు లోడు కోసం వెళితే ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. కొన్ని ఊళ్లల్లో స్థానిక కూటమి నాయకులు లోకల్ అంటూ రోజుకు మూడు ట్రిప్పులు తోలుకుంటుంటే తాము అలా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్లమూడి వెంకటేశ్వరరావు (విజయవాడ అర్బన్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్), అన్నే చిట్టిబాబు (ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు) సూరెడ్డి సాంబిరెడ్డి (పైపుల రోడ్ శాండ్ లారీ ఓనర్ల అసోసియేషన్), చుక్కాపు రమేష్, రత్తయ్య, తన్నీరు పాపారావు (డిస్ట్రిక్ట్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు) తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి» కిరాయికి ఇసుక తోలే ట్రాక్టర్‌కు రూ.1500, 6 టైర్ల లారీకి రూ.3 వేలు, 10 టైర్ల లారీకి రూ.6 వేలు, 12–14 టైర్ల లారీకి రూ.10 వేలు డిపాజిట్ చేయాలనడం దుర్మార్గమైన చర్య కాదా?» ఇసుక రవాణా చార్జిల విషయంలో రవాణా శాఖ, కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారులు లారీ యజమానులతో చర్చించకుండా వారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం లారీ ఓనర్లను మోసం చేయడం కాదా?» లారీ కిరాయి ధరపై జీఎస్టీ విధింపు ఎంత వరకు సమంజసం?» బుక్ చేసుకున్న వారికి లోడును చేరవేయడంలో జాప్యం (ట్రాఫిక్ రద్దీ లేదా లారీ రిపేర్) జరిగితే జరిమానా విధిస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయం?» ఇంతకూ ఇసుక కిరాయి ఎవరు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారు.. ఎక్కడ ఇస్తారు? » వేలకు వేలు ట్యాక్స్‌లు, డ్రైవర్ జీతభత్యాలు కట్టుకుంటూ ప్రభుత్వ ఆంక్షలు పాటించే కంటే మా లారీలను సర్కారుకే అప్పగిస్తాం.. అలా చేస్తే నెలకు ఎంత ఇస్తారు?ఇసుక ఫ్రీ అని చెప్పి బ్లాక్‌లో అమ్ముకుంటారా? డాబాగార్డెన్స్: ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి ధరలు మరింత పెంచి బ్లాక్‌లో అమ్ముతూ.. భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొడుతున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కార్మికులను తీవ్రంగా మోసం చేశారని భవన నిర్మాణ కార్మికులు ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకపోతే వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక రోడ్డున పడ్డామంటూ సిటూ ఆధ్వర్యంలో మంగళవారం గొల్లలపాలెం సింగ్ హోటల్ జంక్షన్ వద్ద నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం.సుబ్బారావు, కె.నర్సింగరావు, చంద్రమౌళి, సిమ్మినాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ గాల్లోకి వదిలేసిందన్నారు. ఇసుక లభించకపోవడంతో వేలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇంతగా రోడ్డున పడినా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. -
మోదీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్సు తీసేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం దోచుకున్నది చాలని.. వీటి ధరలు పెంచి ఇప్పటికే 30 లక్షల కోట్లను మోదీ సర్కార్ దోచుకుందని ధ్వజమెత్తారు. లీటరు పెట్రోల్ రూ.70 డీజిల్ రూ.65కే ఇవ్వాలనేది తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లారీ యాజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీ సర్కార్‌కు సరుకు లేదు, ప్రజల సమస్యలపై సోయి లేదని మండిపడ్డారు. కేంద్రాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహీ అనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పెద్దలకు కేంద్రం రూ.11.5 లక్షల కోట్లు మాఫీ చేసిందని గుర్తు చేశారు. సామాన్యులకు ఉచితాలు ఇవ్వకూడదని కేంద్రం చెబుతోందని అన్నారు. పెద్దలకు మాఫీ చేయొచ్చు కానీ పేదలకు చేయకూడదా అని ప్రశ్నించారు. ‘దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిన ఘనత కేసీఆర్‌ది. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. నేడు మూడున్నర కోట్ల టున్నల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. 8 ఏళ్లుగా ఒకే మాట మీద అందరం నడుస్తున్నాం. కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతుంది. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది. తెలంగాణను అవమానించిన బీజేపీ నేతల తోకలు కత్తిరించాలి’ అని కేంద్రంపై మండిపడ్డారు. చదవండి: కళ్ల జోడు లేకుండా చదవలేకపోతున్నా: కేటీఆర్ -
కోడెలపై లారీ ఓనర్ల ఫైర్..!
సాక్షి, గుంటూరు : అక్రమంగా కేసులు పెట్టి వేదిస్తున్నార్న కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యలపై ఇసుక లారీ అసోషియేషన్ నేతలు మండిపడ్డారు. కోడెల శివరాం తమను బెదిరించి 400 లారీల ఇసుక తీసుకెళ్లారని తెలిపారు. మాటవినకపోతే పోలీసులతో బెదిరించారని అన్నారు. గుంటూరు, నరసరావుపేట, గోళ్లపాడు, సత్తెనపల్లిలోని వారి నిర్మాణాలకు ఇసుక తరలించారని చెప్పారు. డబ్బులు ఇమ్మని అడిగితే అక్రమంగా నిర్భదించి భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు కోడెల కుటుంబం నుంచి తమను కాపాలని కోరుతూ లారీ ఓనర్లు ఒక లేఖ విడుదల చేశారు. ఇన్ని అక్రమాలు బయటపడుతున్నా తమ కుటుంబంపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కోడెల వ్యాఖ్యానించడం దారుణమన్నారు. (చదవండి : ‘కోడెల ట్యాక్స్ పుట్ట బద్దలవుతోంది) (చదవండి : అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె) -
పూర్తిగా నిలిచిన రవాణా సేవలు
ఖిలా వరంగల్: భవిష్యత్ కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన నిబంధనలు, ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ లారీ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం రవాణా సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు సమ్మెలో సుమారు 2వేల లారీలను ఎక్కడికక్కడే సరుకులతో నిలిపి వేశారు. వివిధ జిల్లాలకు చెందిన వందలాది లారీలు రోడ్డుపైన బారులు తీరాయి. ఈ మేరకు జిల్లాకు వచ్చిన సరుకులు, నిత్యావసరాల లోడులను మాత్రం కలెక్టర్ ఆదేశం మేరకు యాజమాన్యాలు రవాణా, దిగుమతికి అనుమతించాయి. ఈ సందర్భంగా నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా జిల్లా ఆధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లారీ ఓనర్లు రోడ్లపై వినూత్న నిరసనలు రోడ్లపై లారీలను యాజమానులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ అందోళన, ఆర్ధనగ్న ప్రదర్శనలు, వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒకపక్క వర్షం కురుస్తున్న లారీ యజమానులు రోడ్లపై బైఠాయించి అందోళనలు చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించి అసోసియేషన్ నాయకులకు నచ్చ చెప్పి ట్రాఫిక్ క్లీయర్ చేశారు. దూర ప్రాంతాల డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డు పక్కనే వంటా వార్పు చేస్తూ కనిపించారు. సమ్మె ఎప్పటికీ ముగస్తుందో ఆర్థం కావడం లేదని, ఎక్కువ రోజుల పడితే తమ వద్ద ఖర్చులకు చేతిలో డబ్బులేవని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె మరింత ఉధృతం చేస్తాం..సమ్మిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి లారీ యజమానుల సమస్య పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వరంగల్ డిస్ట్రిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సమ్మిరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ జె.మధుసుధన్‌రావు హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ నగర ప్రధాన రోడ్లపై వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్, ఓరుగల్లు లోకల్ లారీ, వరంగల్ లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అందోళనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగం పట్ల ఆత్యంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని లారీ యజమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ ప్రధానమైన 11డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేకుంటే ఆదివారం నుంచి నిత్యవసర సరుకులను సరఫరా చేసే వాహనాలను కూడా ఆడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజాపాషా,వరంగల్ లోకల్ లారీ అధ్యక్షుడు వేముల భూపాల్, ఓరుగల్లు లారీ ఆసోసియేషన్ అధ్యక్షుడు ఎండి గోరేమియా,సప్లై అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి బాబర్, కొండా సత్యనారాయణ, ఎండీ యూసూఫ్, ఎండి ఫీరోజ్, సద్దాం హుస్సేన్,రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, నారాయణ, వేముల క్రాంతి, సాధిక్, వాడికే విద్యాసాగర్, రాజు,సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన లారీ ఓనర్స్
-
లారీల బంద్ ఉద్ధృతం
- ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు విఫలం - 8 నుంచి దేశవ్యాప్త బంద్ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిపై ఆగ్రహం నెల్లూరు(టౌన్): దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ చేపట్టిన బంద్ సోమవారానికి ఐదో రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మెపై సానుకూల స్పందన రాకపోవడంపై లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో సోమవారం లారీ అసోసియేషన్ నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈనెల 8 నుంచి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు పాలు, గుడ్లు, కూరగాయలు, చాపలు, రొయ్యలు, నిత్యావసర సరుకులు సరఫరా చేసే రవాణా వాహనాలకు సమ్మె నుంచి మినాహాయింపు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో వాటిని కూడా నిలిపివేయాలని లారీ యజమానుల అసోసియేషన్ నాయకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లారీ యజమానులు అన్ని రకాల వాహనాలను నిలిపివేయాలని నిర్ణయంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో రూ.12.5 కోట్లు నష్టం లారీ యజమానుల సంఘం సమ్మె పిలుపుతో జిల్లాలో రూ.12.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 4500కు పైగా చిన్న పెద్ద రవాణా వాహనాలు ఉన్నాయి. రోజుకు సరాసరి రూ.2.5 కోట్లు వీటి ద్వారా ఆదాయం లభిస్తుంది. గత 5 రోజులుగా లారీల సమ్మె నిర్వహిస్తున్నారు. çసమ్మె కారణంగా పనిలేక డ్రైవర్లు, క్లీనర్లతోపాటు కూలీలు ఇంటిపట్టునే ఉంటున్నారు. సమ్మెను తీవ్రతరం చేస్తాం. గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన కరువైంది. ఈనెల 8 నుంచి అన్ని రాష్ట్రాల లారీ అసోసియేషన్ సంఘాలు సమ్మెలో పాల్గొననున్నాయి. పాలు, గుడ్లు, కూరగాయలు, పచ్చి సరుకులు తరలించే వాహనాలను కూడా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం. – గోపాలనాయుడు, నారాయణ, ఏపీ లారీ యజమానులు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు -
ఉధృతమవుతున్న ప్రత్యేక హోదా పోరు
-
లారీలు రోడ్డెక్కాయ్
లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో సర్కారు చర్చలు సఫలం సాక్షి, హైదరాబాద్: ఒకరోజు సమ్మె అనంతరం లారీలు రోడ్డెక్కాయి. లారీ యజమానుల సంఘం డిమాండ్లను పరిశీలించేందుకు రాష్ట్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించటంతో లారీల సమ్మెకు తెరపడింది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన సమ్మె వల్ల ఎరువులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది ఎదురుకావటంతో విషయాన్ని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయా శాఖల మంత్రులు సమస్య తీవ్రతను సీఎం కేసీఆర్‌కు వివరించారు. లారీ యజమానుల సంఘంతో చర్చించి సమ్మె విరమించేలా చూడాలని ఆయన ఆదేశించటంతో గురువారం ఉదయం మంత్రులు మహేందర్‌రెడ్డి, హరీశ్‌రావు లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో సచివాలయంలో చర్చించారు. 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినా వారు.. త్రైమాసిక పన్నును జనాభా నిష్పత్తిలో తగ్గించాలని, ఏపీ తెలంగాణ మధ్య లారీలు తిరిగేలా వార్షిక కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలనే డిమాండ్లపై పట్టుబట్టారు. వీటిపై సీఎం స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సినందున మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. వాటికి అంగీకరిస్తేనే సమ్మె విరమిస్తామని పట్టుబట్టడంతో పర్మిట్లకు సమ్మతిస్తున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. త్రైమాసిక పన్ను తగ్గింపు సహా మిగతా డిమాండ్లపై స్పష్టత ఇచ్చేందుకు గడువు కావాలని, దీనిపై రవాణా రంగంతో ముడిపడిన విభాగాల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రతిపాదించారు. కమిటీ 3 వారాల్లో నివేదిక సమర్పిస్తుందని, దాని సిఫార్సుల ఆధారంగా డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి సమ్మతించిన లారీ యజమానుల సంఘం.. సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించింది. గుజరాత్ విధానాల అధ్యయనం.. గుజరాత్లో రవాణా రంగ విధానాలు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో వాటిని అధ్యయనం చేసేందుకు అధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధుల బృందాన్ని పంపాలని నిర్ణయించినట్టు సమావేశానంతరం మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అక్కడి విధానాలను పరిశీలించి ఉన్నతమైనవాటిని ఇక్కడ అమలు చేస్తామన్నారు. రవాణా, వాణిజ్య పన్నులు, పోలీసు శాఖలు వేధిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ మూడు విభాగాల ఉన్నతాధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో ఉన్నతస్థాయి భేటీని ఏర్పాటు చేసి చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని హైవేలపై లారీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామని, 38 రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో డ్రైవర్ల శిక్షణకు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రూ.5 వేలు చెల్లిస్తే రెండు రాష్ట్రాల పర్మిట్.. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్యా కొత్తగా త్రైమాసిక పన్ను విధింపు అమలులోకి వచ్చింది. తాజా చర్చల్లో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ అంగీకరిస్తే.. వార్షికంగా రూ.5 వేలు చెల్లించి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ పొందే వెసులుబాటు కలుగుతుంది. ఆ పర్మిట్లకు ఏపీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటకలతో ఉన్న ఒప్పందం తరహాలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కోసం ఏపీకి లేఖ రాయనున్నట్టు మంత్రి చెప్పారు. చర్చల్లో లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. -
కాకినాడ ‘దేశం’..ఆధిపత్య సమరం..
టీడీపీ నేతల మధ్య రచ్చకెక్కుతున్న విభేదాలు పార్టీ నగర అధ్యక్షుడు దొరబాబు, వాణిజ్య విభాగం నేత బాబ్జీ వర్గాల మధ్య పెరుగుతున్న దూరం సాక్షి ప్రతినిధి, కాకినాడ :కాకినాడ తీరంలో తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరులో కొట్టుకుపోతున్నారు. పలు అంశాల్లో పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంక్ ఓనర్స్ అసోసియేషన్, కాకినాడ పోర్ట వర్కర్స్ యూనియన్ల వ్యవహారాలు, మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. ఇలా అనేక విషయాల్లో ‘దేశం’ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూండడంపై కేడర్‌లో ఆందోళన నెలకొంది. ఈ అంశాల్లో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, పార్టీ వాణిజ్య విభాగం నాయకుడు, గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. చివరకు ఈ వివాదం.. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో సోమవారం రాత్రి బాబ్జీకి చెందిన ధనలక్ష్మి ఫౌండేషన్ ఆరో వార్షికోత్సవానికి మంత్రులు దూరమయ్యే పరిస్థితికి దారి తీయడం టీడీపీలో చర్చనీయాంశమైంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకూ దొరబాబు, బాబ్జీ చెట్టపట్టాలేసుకునే తిరిగారు. అనంతరం కాకినాడ దిగుమర్తివారివీధిలో వినాయక చవితి పందిరి విషయంలో వారిమధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడవి చినికిచినికి గాలివానగా మారి, రెండు వర్గాలుగా విడిపోయే వరకూ వెళ్లింది. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్న సాకుతో చవితి పందిరిని తొలగించేందుకు ఆ పార్టీకి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై బాబ్జీ ఒత్తిడి తెచ్చారు. దీనిని దొరబాబు వర్గీయులు వ్యతిరేకించడంతో వారిమధ్య వివాదం మొదలైందని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ విషయంలో దొరబాబుదే పైచేయి అయింది. దీంతో దొరబాబు వర్గానికి బాబ్జీ దూరంగానే ఉంటున్నారు. దీనికి ఆర్థికపరమైన సర్దుబాట్లలో తలెత్తిన విభేదాలు కూడా తోడవడంతో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి పార్టీ నగర అధ్యక్షుడైన దొరబాబును ఆహ్వానించలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వానించి, కేవలం దొరబాబును మాత్రమే విస్మరించడం కావాలని చేసింది కాక మరేమిటని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. దీనిపై ముఖ్యనేతల వద్ద తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన దొరబాబు వర్గీయులు ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకుండా చేయగలిగారని చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి ఎమ్మెల్యే కొండబాబు హాజరవడాన్ని దొరబాబు వర్గీయులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పార్టీ కార్యక్రమం కాకున్నా అందరినీ ఆహ్వానించి, తనను పిలవకపోవడాన్ని అవమానంగా భావించి.. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారు కార్యక్రమానికి హాజరు కాలేదని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ కయ్యం.. మేయర్ పీఠం కోసమేనా! బాబ్జీ, దొరబాబులు రెండు వర్గాలు కావడానికి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా మరో కారణమని నేతలు విశ్లేషిస్తున్నారు. అసలు జరుగుతాయో లేదో తెలియని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం కోసమే వారు పరస్పరం కయ్యానికి కాలుదువ్వుతున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన కాపు సామాజికవర్గానికే మేయర్ సీటు కట్టబెట్టాలని దొరబాబు, వైశ్య సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని బాబ్జీ చెరో అజెండాతో వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేకి ఆర్థికంగా చేయూతనిచ్చిన అంశాన్ని తెరపైకి తెచ్చి, తన కుటుంబ సభ్యులకు మేయర్ సీటు ఇప్పించుకొనేందుకు బాబ్జీ ప్రయత్నిస్తున్నారని దొరబాబు వర్గం ఆగ్రహంతో ఉంది. అదే జరిగితే ఎంతకైనా వెళతామని వారు చెబుతున్నారు. ఈ విభేదాలు ఏ విపరిణామాలకు దారి తీస్తాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వర్గ విభేదాలను ఎమ్మెల్యే కొండబాబు ఎలా దారికి తెస్తారనేది వేచి చూడాల్సిందే. -
9 నుంచి కీలక ఉద్యమం
విజయవాడ, న్యూస్‌లైన్ : ఈ నెల 9వ తేదీ నుంచి కీలకమైన ఉద్యమం ప్రారంభమవుతుందని ఏపీఎన్జీవో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య యువజన సదస్సు బెంజ్‌సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో గురువారం జరిగింది. హాలు ప్రాంగణం అంతా సమైక్య నినాదాలతో హోరెత్తిపోయింది. అశోక్‌బాబు మాట్లాడుతూ 9న సమైక్యాంధ్ర విద్రోహ దినంగా పరిగణించాలన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కృష్ణయాదవ్ మాట్లాడుతూ చదువు, సంస్కారం లేని సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేస్తున్నారని విమర్శించారు. పీవీ నరసింహారావు గాంధీ కుటుంబాన్ని పక్కనబెట్టి పాలన సాగించారని, తెలుగువారు కలిసి ఉంటే మరలా వారికి ఎటువంటి ఆపద వస్తుందోనని రాష్ట్రాన్ని విభజిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంతవాసులు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తామని చెప్పి కలిసి, అభివృద్ధి చెందిన తరువాత విడిపోతామని డిమాండ్ చేస్తే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్య యువజన కన్వీనర్ కిశోర్‌కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ 9 నెలల పాటు రాష్ట్రం అంతటా పర్యటించి తెలంగాణా అభివృద్ధి చెందిందని, విభజన జరిగితే అనేక కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని నివేదికలో సమర్పించినట్లు చెప్పారు. సీమాంధ్రకు రూ.10 లక్షల కోట్లు ప్యాకేజి ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు.. ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. నరేంద్రమోడి చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమని ప్రకటిస్తున్నారు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ర్టంలో కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది.. దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని ప్రశ్నించారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ రాజకీయాలు తిండి పెట్టవని, ఉద్యమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు తక్కువ పనిగంటలు పెట్టి అందరూ ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. తెలుగు జాతిని ఢిల్లీలో అమ్మేశారని విమర్శించారు. సోనియాగాంధీకి తెలుగు ప్రజలపై ఆసక్తి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంద్ర విద్యార్ది జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మదిలో సమైక్యాంధ్ర నినాదం ఉంటూనే ఉందన్నారు. గుంటూరు జిల్లా జేఏసీ ప్రతినిధి శేషు మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఆగేవరకు ఉద్యమం ఆగదన్నారు. భావితరాల భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమం చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లా జేఏసీ ప్రతినిధి జగదీష్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎందుకు రాష్ట్ర విభజనను ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా జేఏసి ప్రతినిధి డేవిడ్ మాట్లాడుతూ సమైక్య రాష్ర్టంలోనే విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు, రాష్ట్ర విభజన జరిగితే లభిస్తాయా అని అడిగారు. నేడు బంద్‌కు పిలుపు కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో సంఘం వేరొక ప్రకటనలో శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. -
అన్ని వర్గాల శ్వాస..సమైక్యమే...
విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటోంది. అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. విజయనగరం పట్టణంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాం ధ్రకు మద్దతుగా వినూత్న తరహాలో క్వారీ లారీలతో నిరసన వ్యక్తం చేశారు. బాలాజీ జంక్షన్ నుంచి బయలుదేరిన నిరసన ర్యాలీ జేఎన్టీయూకే ఇంజినీరింగ్ క్యాంపస్ జంక్షన్ వరకు సాగింది. అనంతరం అక్కడ విజయనగరం-సాలూరు జాతీయ రహదారిపై వంటా వార్పు చేశారు. సమై క్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సోనియా, దిగ్విజయ్, మంత్రి బొత్సల మాస్కులు ధరించిన వ్యక్తులను హోమం వద్ద కూర్చుండబెట్టి వారికి పట్టిన వేర్పాటు వాద భూతం వదలాలంటూ పూజ లు జరిపించారు. వివిధ మత్స్యకార సంఘా ల ఆధ్వర్యంలో 500 మంది మత్స్యకారులు జిల్లాలోని వివిధప్రాంతాల నుంచి జిల్లా కేం ద్రానికి తరలివచ్చి పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో తమ వృత్తిలో భాగంగా రోడ్డుపై వలలు వేసి చేపలు పట్టడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే నదీజలాల సమస్య ఏర్పడుతుందని తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని వాపోయారు. నిరసనలో భాగంగా బాలాజీ జంక్షన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్‌ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా వీటీ అగ్రహారం ైవె జంక్షన్ వద్ద జాతీయ రహ దారిని దిగ్బంధించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పిలుపుమేరకు అధిక సంఖ్యలో క్రీడాకారులు ప్రధాన కూడళ్లలో క్రీడలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోట జంక్షన్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేశారు. ఉపాధ్యాయ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ మోటార్ ర్యాలీ సైకిల్ ర్యాలీ నిర్వహించగా...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి..అంత్యక్రియలు చేశారు. డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగగా పలువురు పార్టీ నాయకులు, కార్య కర్తలు రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లో గల స్పోర్ట్స్ స్పిరిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు బైక్ ర్యాలీ చేసి కోట జంక్షన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ అద్దె వాహనాల యజమానులు, వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో వాహనాలతో పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్లలో ఆర్ఓబీ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం-పాలకొండ రహదారిపై ముగ్గులపోటీ నిర్వహించారు. ఎస్‌కోటలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త వేచలపు వెంకట చినరామునాయుడు ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్, బొత్స దిష్టిబొమ్మలతో శవయాత్ర చేశారు. అనంతరం దేవీ జంక్షన్లో దిష్టిబొమ్మలను దహనం చేశారు. అలాగే వైఎస్ ఆర్సీపీ మద్దతుదారు సర్పంచ్‌లు, నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శ్రీదేవి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేవి జంక్షన్‌లోనే వంటవార్పు జరిగింది. సమైక్యాంధ్ర కోసం బొబ్బిలిలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిం చారు. సాలూరులో బోసుబొమ్మ కూడలిలో తోపుడుబళ్లతో ధర్నా చేపట్టగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించి సమైక్యవాదానికి మద్దతు పలికారు. కురుపాం నియో జకవర్గంలోని గరుగుబిల్లిలో సమైక్యాం ధ్రకు మద్దతుగా వెఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.