
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్–2024 దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైనట్లు సెట్ చైర్మన్, జేఎన్‌టీయూకే వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు చెప్పారు. దరఖాస్తులకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలన్నారు.
రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకూ, రూ.1,000 ఫైన్‌తో మే 5 వరకూ, రూ.5 వేల ఫైన్‌తో మే 10 వరకూ, రూ.10 వేల ఫైన్‌తో మే 12వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మే 13–16 వరకూ, అగ్రికల్చర్, ఫార్మసీకి మే 17–19 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఏపీలో 47, హైదరాబాద్‌లో 1, సికింద్రాబాద్‌లో 1 చొప్పున ఆన్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మే 7 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షకు ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వివరాలకు 0884–2359599, 0884–2342499 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.