రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ జిల్లాలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు
కడప: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ జిల్లాలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. రాజంపేటలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉద్యమానికి ఎమ్మెల్యేలు అమర్నాథ రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వైఎస్ఆర్ సిపి నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కనువిప్పు కలిగేలా ప్రతి ఒక్కరూ పోస్టుకార్డు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు.