ఏపీఎన్జీఓ నేతలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(పిఎస్) పీకే మహంతి జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
హైదరాబాద్: ఏపీఎన్జీఓ నేతలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(పిఎస్) పీకే మహంతి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించాలని మహంతి ఉద్యోగులను కోరారు. సమ్మె విరమించేదిలేదని ఉద్యోగ సంఘాల నేతలు తెగేసి చెప్పారు.
రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా ఏపీఎన్జీఓలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమైక్యంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు, ఎంత కాలమైనా సమ్మె కొనసాగించడానికి సిద్దంగా ఉన్నట్లు ఏపీఎన్జీఓలు నిన్ననే ప్రకటించారు.