సమ్మె వల్ల సమస్యలు: మంత్రి ఆనం | Problems with APNGOs strike: Minister Anam Ramanarayana Reddy | Sakshi
Sakshi News home page

సమ్మె వల్ల సమస్యలు: మంత్రి ఆనం

Published Mon, Aug 12 2013 4:31 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

సమ్మె వల్ల సమస్యలు: మంత్రి ఆనం - Sakshi

సమ్మె వల్ల సమస్యలు: మంత్రి ఆనం

హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సమ్మెవల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మంత్రుల బృందంతో ఏపీ ఎన్జీవో నేతల చర్చలు ముగిసిన తరువాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఎన్జీవోల సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను  బహిష్కరించడం సరికాదని మంత్రి అన్నారు.

సమ్మె వాయిదా వేసుకోవడం కుదరదని  ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పిన విషయం తెలిసిందే. ఏపి ఎన్జీఓలు ఈ రోజు అర్ధ రాత్రి నుంచి సమ్మె చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement