హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
అత్యవసర సేవలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. తిరుమల యాత్రికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈఓ, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రాన్ని విడగొట్టకుండా ఉండాలన్న డిమాండ్ తో ఏపి ఎన్జీఓలు ఈ రోజు నుంచి సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే.