సమైక్యరాష్ట్రం కోసం తాము రాజీనామాలు చేయవలసిన అవసరం లేదని కేంద్ర మంత్రి జేడి శీలం అన్నారు.
న్యూఢిల్లీ: సమైక్యరాష్ట్రం కోసం తాము రాజీనామాలు చేయవలసిన అవసరం లేదని కేంద్ర మంత్రి జేడి శీలం అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకించాలో తమకు తెలుసని చెప్పారు. వచ్చే శీతకాల సమావేశాల్లో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ బిల్లు ఆమోదం పొందుతుందని మంత్రి అన్నారు.
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూనే తమ పదవులకు రాజీనామాలు చేయని విషయం తెలిసిందే.