బాబు హైదరాబాద్‌ వదిలి ఎందుకొచ్చారు ? | jd seelam fires on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబు హైదరాబాద్‌ వదిలి ఎందుకొచ్చారు ?

Published Fri, Feb 16 2018 11:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

jd seelam fires on cm chandrababu naidu - Sakshi

క్రోసూరు(పెదకూరపాడు): రాష్ట్ర విభజన సమయంలో రాజధాని హైదారాబాద్‌ పదేళ్లు కావాలని పోరాడి తీసుకొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ నుంచి ఎందుకొచ్చారో ప్రజలకు తెలుసునని రాజ్యసభ మాజీ సభ్యుడు జేడీ శీలం అన్నారు.  క్రోసూరులో గురువారం ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు అధ్యక్షత వహించారు. జేడీ శీలం మాట్లాడుతూ 2019లో కేంద్రంలో కాంగ్రెస్‌ గెలిస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందన్నారు. 

ప్యాకేజీ సొమ్ముకు వడ్డీ చెల్లించాలి
గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంటే నూతన రాజధానికి అయ్యే పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తుందని, అదే ప్రత్యేక ప్యాకేజీ అంటే ఎంత డబ్బు తెచ్చుకుంటే అంత వడ్డీతో సహా చెల్లించాలని చెప్పారు. అనంతరం సభలో ప్రత్యేక హోదాపై రాహుల్‌గాంధీ ప్రసంగం ఆడియోను ప్రజలకు వినిపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, యార్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ షరీఫ్, జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement