రాష్ట్ర విభనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. కడప నగరంలోని శంకరాపురం వద్దనున్న 220 కేవీ విద్యుత్ ఉప కేంద్రం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: రాష్ట్ర విభనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. కడప నగరంలోని శంకరాపురం వద్దనున్న 220 కేవీ విద్యుత్ ఉప కేంద్రం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కృష్ణా సర్కిల్, గోకుల్ సర్కిల్, వన్‌టౌన్, పాత బస్టాండ్ మీదుగా జడ్పీ కార్యాలయానికి చేరుకుంది. ర్యాలీని ఉద్దేశించి విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్లు ఐ గుర్రప్ప, డి నాగరాజులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారాన్ని రాజకీయనేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రాంతీయ ఉద్యమాలు రెండేళ్ల కిందట ప్రారంభమైనప్పుడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను, అక్కడి వనరులను తెలుసుకునేందుకు శ్రీకృష్ణ కమిటీని వేశారన్నారు. ఆ సమయంలో అన్ని ప్రాంతాల వారు వారి మనోభావాలను కమిటీ సుభ్యులకు వివరించారన్నారు. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. అయితే ఆ కమిటీ చేసిన సిపార్సులను కాదని, రాజకీయ పార్టీలకు తలొగ్గి హడావుడిగా విభజన ప్రకటన చేశారని దుయ్యబట్టారు. విభజన ప్రకటన వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు.ఈ ర్యాలీలో 16 విద్యుత్ యూనియన్ల అధ్యక్ష, కార్యదర్శులు, డిస్కంల అధ్యక్షులు, కార్యదర్శులు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.