ఆ హామీలు ఇప్పుడు నెరవేర్చడం కష్టం
ఎన్నికల హామీలపై చంద్రబాబు తన చావుకబురు చల్లగా చెప్పారు. అప్పట్లో సమైక్య రాష్ట్రం ఉండేదని, అప్పుడు తాను సమైక్య రాష్ట్రంలోనే హామీలు ఇచ్చానని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని, ఆ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నింటినీ ఇప్పుడు నెరవేర్చడం కష్టమని ఆయన చెప్పారు. గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సభలో మాట్లాడారు. ''మీరు నామీద నమ్మకం పెట్టుకున్నారు. నేనైతేనే చేయగలనని నమ్మి ఓట్లేశారు. ఒకటి కాదు, రెండు కాదు, నేను ఆ రోజు చాలా హామీలు ఇచ్చాను. కానీ ఇప్పుడవి నెరవేర్చడం కష్టం'' అని ఆయన అన్నారు.