ఆర్థిక నిర్వహణ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాగ్ నిలువునా కడిగేసింది. 2013 మార్చితో ముగిసిన ఉమ్మడి రాష్ట్ర నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందు ఉంచింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు చాలా లోపభూయిష్టంగా ఉందని కాగ్ మండిపడింది. మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. 2013 మార్చి నాటికి ఉమ్మడి రాష్ట్రంలో అన్నిరకాల పింఛన్లు కలిపి రూ. 72.36 లక్షల కోట్లు ఉన్నాయని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర పథకాలకు ఖర్చుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పింది. పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రైవేటు సంస్థకు అప్పగించారని, పింఛన్ల అర్హుల నిర్ధారణకు ప్రభుత్వ యంత్రాంగం లేదని మండిపడింది. పింఛను లబ్ధిదారులు, రేషన్ కార్డులను పోల్చిచూసేందుకు సరైన డేటాబేస్ లేదని , పింఛన్ల కోసం స్మార్ట్ కార్డుల ప్రక్రియ పూర్తికాలేదని కాగ్ చెప్పింది.
ఉమ్మడి రాష్ట్రాన్ని కడిగేసిన కాగ్
Published Fri, Nov 28 2014 1:36 PM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM
Advertisement