వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా నర్సీపట్నంలో ఆ పార్టీ సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్ దీక్ష చేపట్టారు.
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా నర్సీపట్నంలో ఆ పార్టీ సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షాశిబరాన్ని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సందర్శించారు. ఈ దీక్షకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తోంది.
విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా విశాఖపట్నంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో వంశీకృష్ణ యాదవ్, పక్కి దివాకర్ పాల్గొన్నారు. రాజకీయ జేఏసీ నేత రామారావు, విద్యార్ధి జేఏసీ నేత కిషోర్‌కుమార్, జర్నలిస్టుల సమితి అధ్యక్షుడు వి.వి.రమణమూర్తి సంఘీభావం ప్రకటించారు. వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా తగరపువలస గోస్థని నదీతీరంలో వైఎస్ఆర్ సీపీ నేత అక్రమాని విజయనిర్మల సారథ్యంలో సమైక్యవాదులు వరినాట్లు నాటారు.