ఓ వీధిలో పదిమంది కలుస్తున్నారు. ఆ మరునాటి ఉదయూన్నే సమైక్యాంధ్ర ఉద్యమం చేయూలనుకుంటున్నారు. తమకొచ్చే ఆదాయం అంతంతమాత్రమే అరుునా తలో వందా రెండొందల చొప్పున చందాలు వేసుకుంటున్నారు. ప్ల కార్డులు లేదా బ్యానర్లు తయూరు చేరుుంచుకుంటున్నారు. రిక్షా, మైకు మాట్లాడుకుని ‘జై సమైక్యాంధ్ర’ నినాదం అందుకుంటున్నారు. రోడ్డెక్కేసరికి ఆ పదిమంది కాస్తా వందలాదిగా అవుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు. వారిలో ఎవరూ నాయకులు కాదు. ఏరోజూ మైకులో మాట్లాడి ఎరుగరు. అరుునా.. వారే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. బిందువులన్నీ సింధువైనట్టుగా.. చలిచీమలన్నీ ఏకమై మహాసర్పం పీడ విరగడ చేసినట్టుగా.. గడ్డిపూచలన్నీ తాడులా మారి మదించిన ఏనుగు పీచమణిచిన చందంగా ఉద్యమ సెగను ప్రజ్వలింప చేస్తూ ఢిల్లీకి వినిపించేలా పొలికేక పెడుతున్నారు.
సాక్షి, ఏలూరు :రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ జిల్లా వాసులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్ర విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక మరో నలుగురి గుండెలు ఆగిపోయూరుు. ఉండి గ్రామంలోని చుక్కాల వీరన్న నగర్‌కు చెందిన కిలారి విష్ణు(32) గుండె ఆగి మరణించాడు. మొగల్తూరులో సవర నాగరాజు (29) మనస్తాపంతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. హైదరాబాద్‌లో వడ్రంగి పని చేసుకునే నాగరాజు ఇటీవల గ్రామానికి వచ్చాడు. సమైక్యాంధ్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఉద్యమాలు వెల్లువెత్తినా రాష్ట్ర విభజన చేసి తీరతామని ఢిల్లీ పెద్దలు ప్రకటించిన నేపథ్యంలో తనకు జీవనోపాధి పోతుందనే ఆందోళనకు గురైన నాగరాజు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయూడు. చింతలపూడికి చెందిన గుంజి చుక్కమ్మ (45), లింగపాలెం మండలం కె.గోకవరం గ్రామానికి చెందిన ఇందూరు సత్యనారాయణ గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు.
ఉద్యమ ఝరి.. హేలాపురి
జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం ఉద్యమాలతో దద్దరిల్లుతోంది. నేషనల్ మజ్దూర్ యూని యన్ సీమాంధ్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు గురువారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్ర విభజన జరిగితే ముందు నష్టపోయేది ఆర్టీసీయేనని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థను కాపాడుకోవడం కోసం ఈ నెల 12నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామన్నారు. నగరంలో కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. వ్యాపారులు, గుమాస్తాలు మెడలో కూరగాయల దండలు వేసుకుని వైఎంహెచ్‌ఏ హాలు వద్దకు చేరుకున్నారు. అక్కడ తెలుగుతల్లి విగ్రహానికి, పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి, వసంత మహల్ సెంటర్‌లో పొట్టిశ్రీరాముల విగ్రహానికి, జూట్‌మిల్లు వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాలకు కూరగాయలతో చేసిన దండలు వేశారు. 150 కిలోల టమాటలను తీసుకువచ్చి పంపిణీ చేశారు.
రిటైల్ వర్తకులు కొందరు పోలీసుల బూట్లను చొక్కాలతో తుడిచి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ నగర శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మౌనప్రదర్శన నిర్వహించారు. మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహం కళ్ల్లకు నల్ల రిబ్బన్ కట్టి మౌన వేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి, వంటావార్పు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై కబడ్డీ ఆడారు. పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ మనసు మారాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ప్రైవేట్ స్కూల్ యూజమాన్యాల రిలే నిరాహార దీక్షలు గురువారం 5వ రోజు, వసంత మహల్ సెంటర్‌లో గాయత్రి పురోహితుల సంఘం, న్యాయవాదులు, వ్యాపారులు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి.
అడుగడుగునా నిరసనలే జిల్లాలో అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తుతున్నారుు. తణుకులో సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వీరభద్రపురం సెంటర్లో వంటావార్పు చేశారు. వేల్పూరు రోడ్డుపై వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు బైక్ ర్యాలీ చేశారు. చాగల్లులో ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. డ్వాక్రా సంఘాలు, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. నందమూరులో విద్యార్థులు సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. సీతంపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. కొవ్వూరు మెయిన్ రోడ్డులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమైక్యవాదులు, న్యాయవాదులు క్షీరాభిషేకాలు చేశారు. తాళ్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జై సమైక్యాంధ్ర ఆకృతిలో కూర్చుని నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులు ర్యాలీ జరిపారు. సమైక్యాంధ్ర సాధించే వరకు ఉద్యమం ఆగదని మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ అన్నారు. జోరువానలో రోడ్‌పై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు.
నిడదవోలు పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. మునిపల్లిలో వైఎస్సార్ సీపీ కన్వీనర్ రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించారు. కొయ్యలగూడెంలో రిలే నిరాహార దీక్షలు, టి.నరసాపురం మండలంలో నిరసన ర్యాలీలు జరిగాయి. పాలకొల్లులో వేలాదిగా తరలివచ్చిన డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో ఉద్యమాలు భారీ ఎత్తున జరిగారుు. ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, ఆంధ్రా మేధావుల ఫోరం చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో ఉద్యమ వేడి చల్లారలేదు. మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషేన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.