సమైక్య తీర్మానంపై స్పందించలేదేం? | bv raghavulu questioned kiran and chandra babu | Sakshi
Sakshi News home page

సమైక్య తీర్మానంపై స్పందించలేదేం?

Published Mon, Jan 27 2014 2:04 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

bv raghavulu questioned kiran and chandra babu

 కిరణ్, బాబులకు రాఘవులు ప్రశ్న
 ఆదోని, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యత పట్ల చిత్తశుద్ధి ఉంటే విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానం చేయాలని ఓ ప్రధాన రాజకీయ పక్షం చేసిన డిమాండ్‌కు ఎందుకు సానుకూలంగా స్పందించలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో సమైక్య తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు.
 
  చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయకుండా కిరణ్‌ను అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. పునర్విభజనపై కాంగ్రెస్, టీడీపీ మొదటి నుంచీ దొంగాట ఆడుతూ చివరల్లో బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేయాలని కొత్త నాటకానికి తెర తీశాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పసలేని ప్రసంగంతో విలువైన సభా సమయాన్ని వృథా చేశారన్నారు. ఫిబ్రవరిలో పొత్తుల విషయాన్ని వెల్లడిస్తామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీతో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా ప్రజలు కోరుకుంటే అలాగే చేస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement