ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల పథకం ప్రకారమే సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతున్నారని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు విమర్శించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల పథకం ప్రకారమే సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతున్నారని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు విమర్శించారు. సీమాంధ్ర ప్రజల అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వారు పేర్కొన్నారు.
చంద్రబాబు తెలంగాణకే కట్టుబడి ఉన్నారని వారు స్సష్టం చేశారు. సీమాంధ్రుల హక్కుల కోసమే తమ పార్టీ నేతల రాజీనామాలు చేశారని వివరణ ఇచ్చారు. రెచ్చగొట్టే ధోరణి సరికాదని, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని వారు హితవు పలికారు.