
AP Assembly And Council Updates
11:05 AM
శాసనమండలికి స్వల్ప విరామం
శాసనమండలి
- కేంద్రం నుంచి వచ్చే వ్యవసాయ పథకాల్లో కేంద్రం వాటా ఉందా లేదా అని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ సభ్యులు
- వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
- మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యల పై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం
- శాసనమండలి విపక్ష నేత,బొత్స సత్యనారాయణ
- వ్యవసాయానికి పేటెంట్ ఎవరిదో...వ్యవసాయం సుద్ధ దండగ అని ఎవరు చెప్పారో అందరికీ తెలుసు
- వ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చించుకుమదామంటే మేం రెఢీ
- సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదు
- కేంద్రం ఇచ్చిన క్లస్టర్ల పై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం

10:45AM
పెన్షన్ల పై మండలిలో ప్రశ్నోత్తరాలు
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
- జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్ లు ఉన్నాయి
- కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయి
- ఇప్పుడు పెన్షన్లు తొలగిస్తే ...ఎన్ని తొలగించారు
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్
- గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు మంజూరు చేసింది
- కూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మంది పెన్షన్లు తగ్గించారు
- బడ్జెట్ లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదు
- 50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్లు ఇస్తారా.. లేదా..
- పెన్షన్ల పరిశీలన అంటూ తగ్గిస్తూ వెళ్తున్నారు
- కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా అర్హులకు పెన్షన్లు ఇవ్వాలి
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..
- యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు..
- కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఏ ప్రతిపాదన చేయలేదు.
నిన్నటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు
- ఎస్సీల వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం
- రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు
- వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పు
- రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు
- వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పు
‘నిరుద్యోగ భృతి’.. ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’
- పథకం అమలుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ప్రశ్న సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన మంత్రి
- ‘ఆ పథకాన్ని తమ శాఖ అమలు చేయడం లేదంటూ’ జవాబు
- ఎప్పటిలోగా అమలు చేస్తారన్నదానికి ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’
- పథకం ఎప్పటినుంచి అమలు అన్నదానిపైనా దాటవేత
- చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
⇒ ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు, రూ.37.97 కోట్లతో బుడమేరు డైవర్షన్ చానల్ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి పరిపాలన ఆమోదం.
⇒ గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (వీవీఐటీయూ)ని బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతించేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
⇒ సీఆర్‌డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రుల బృందం సిఫార్సుల ఆమోదానికి సీఆర్‌డీఏ కమిషనర్‌ను అనుమతిస్తూ నిర్ణయం. రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు ఎల్ 1 బిడ్లను ఆమోదించడానికి ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ తదితర ఆర్ధిక ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సీఆర్‌డీఏ ఎండీకి అధికారం.
Comments
Please login to add a commentAdd a comment