విశాఖ : సుదీర్ఘ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించుకున్న మహానేత రాజశేఖరరెడ్డి తనయ షర్మిల నేడు హైదరాబాద్ రానున్నారు. సోమవారం ఉదయం వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. షర్మిల విశాఖపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు చేరుకుంటారు.
తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆమె ములాఖత్ అవుతారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కన్నీళ్లు, కష్టాలను షర్మిల నేరుగా జగన్‌మోహన్‌రెడ్డికి వివరించనున్నారు. ప్రపంచ చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా 3112 కిలో మీటర్ల పాదయాత్రతో రికార్డు సృష్టించిన షర్మిలకు శంషాబాద్‌లో పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు భారీ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ నుంచి కాటేదాన్, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్ కింద నుంచి కంచన్‌బాగ్, ఒవైసీ ఆస్పత్రి, ఐఎస్ సదన్ మీదుగా చంచల్‌గూడకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
విశాఖ విమానాశ్రయం చేరుకున్న షర్మిల
Published Mon, Aug 5 2013 9:00 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement