Maro praja prastanam
-
సోదరుడికి ప్రజల కష్టాలు వివరించిన షర్మిల
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల... ఆ వివరాలన్నింటినీ చంచల్‌గూడ జైల్లో తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి వివరించారు. విమానాశ్రయం నుంచి నేరుగా జైలు వద్దకు చేరుకున్న ఆమె, ములాఖత్ ద్వారా ఆయనను కలుసుకున్నారు. అశేష ప్రజాభిమానం ఎలా ఉందో వివరించారు. కొద్దిసేపటి తర్వాత ఆమె చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. పాదయాత్ర సాగిన తీరు పట్ల జగన్ మోహన రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, తామందరినీ ఆయన అభినందించారని జైలు బయట విలేకరులకు చెప్పారు. తమను ఆశీర్వదించి, సహకరించి, తమ సహకారం అందించిన ప్రజలకు, పాదయాత్రను ఆశీర్వదించిన దేవుడికి షర్మిల కృతజ్ఞతలు తెరలిపారు. అంతకుముందు పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న షర్మిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖపట్నం నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో షర్మిలకు పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజన్న బిడ్డకు స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. షర్మిల.. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగింది. సుదీర్ఘ పాదయత్ర చేసిన మహిళగా వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 2012 అక్టోబర్ 18న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో షర్మిల మోకాలుకు గాయం కావడంతో కొంతకాలం పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజులలో ఆమె పూర్తి చేశారు. రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 అసెంబ్లీ నియోజక వర్గాలు, తొమ్మిది కార్పొరేషన్లు, 45 మున్సిపాల్టీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు. -
షర్మిలకు వైఎస్ జగన్ అభినందనలు
-
సోదరుడికి ప్రజల కష్టాలు వివరించిన షర్మిల
-
విశాఖ విమానాశ్రయం చేరుకున్న షర్మిల
విశాఖ : సుదీర్ఘ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించుకున్న మహానేత రాజశేఖరరెడ్డి తనయ షర్మిల నేడు హైదరాబాద్ రానున్నారు. సోమవారం ఉదయం వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. షర్మిల విశాఖపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు చేరుకుంటారు. తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆమె ములాఖత్ అవుతారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కన్నీళ్లు, కష్టాలను షర్మిల నేరుగా జగన్మోహన్రెడ్డికి వివరించనున్నారు. ప్రపంచ చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా 3112 కిలో మీటర్ల పాదయాత్రతో రికార్డు సృష్టించిన షర్మిలకు శంషాబాద్‌లో పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు భారీ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ నుంచి కాటేదాన్, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్ కింద నుంచి కంచన్‌బాగ్, ఒవైసీ ఆస్పత్రి, ఐఎస్ సదన్ మీదుగా చంచల్‌గూడకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
పాదయాత్ర ధైర్యాన్నిచ్చింది
మహానేత తనయ షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తమకు ఎంతో ధైర్యం ఇచ్చిందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ అన్నారు. షర్మిలమ్మ పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్ఆర్ టూరిజం పార్కు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జగనన్న వదిలిన బాణంగా ఈ పాదయాత్రను రికార్డు స్థాయిలో నిర్వహించినందుకు ఆమెకు శిరసువంచి నమస్కరిస్తున్నానన్నారు. ఇచ్ఛాపురంలొ పాదయాత్ర ముగించడం గర్వంగా ఉందన్నారు. నరనస్నపేట ఎమ్యెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని, జగన్ నాయకత్వంలో రాజన్న రాజ్యం తేచ్చి ఆ సమస్యలు పరిష్కరించడానికి గాను షర్మిలమ్మ పాదయాత్ర సంధానకర్తగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం మాట్లాడుతూ మరో ప్రజాప్రస్థానం మహా ప్రజా ప్రస్థానమని అభివర్ణించారు. రాష్ట్రాన్ని విభజన చేసినా స్పందించిన కాంగ్రెస్ నాయకులు చీమూనెత్తురు ఉంటే వెంటనే పార్టీ నుంచిబయటకు రావాలన్నారు. పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొనడంతో జన్మధన్యమైందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ ఎండనక, వానక 230 రోజులు పాదయాత్ర చేసిన షర్మిలమ్మ మనోధైర్యానికి శిరసువంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. సమావేశంలో కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం.వి.కృష్ణారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర బాబు, ఎస్సీ సెల్ కన్వీనర్ సల్లా దేవరాజ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హనుమంతు కిరణ్ కుమార్, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డెపల్లి పద్మజ, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ వి.టి.నాయుడు, జిల్లా డాక్టర్ సెల్ కన్వీనర్ పైడి మహేశ్వరరావు, పలాస,శ్రీకాకుళం,పాలకొండ,రాజాం,ఆమదాలవలస,పాతపట్నం, టెక్కలి,ఎచ్చెర్ల సమన్వయకర్త వజ్జ బాబూరావు, వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, పాలవలస విక్రాంత్, కళావతి, పీఎంజే బాబు, కిల్లి రామ్మోహనరావు, బోడ్డెపల్లి మాధురి, కలమట వెంకటరమణ, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, పలాస నాయకుడు దువ్వాడ శ్రీధర్, మాజీ ఎమ్యెల్యే కంభాల జోగులు, ఎచ్చెర్ల మాజీ ఎంపీపీ బి.జనార్దనరెడ్డి,హేమమాలిన రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోత మురళిధర్, పిరియా విజయ, కూన మంగమ్మ,ధర్మాన ఉదయభాస్కర్, నియోజకవర్గ కన్వీనర్లు పిలక పోలారావు, కారంగి మోహనరావు, మేరుగు వెంకటరెడ్డి, పిట్ట ఆనంద్, చత్రపతి, పి.కోటి, నాయకులు జి.తారక్,పిఎం.తిలక్, ధవళ గరిబాబు,జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
తెలుగువాళ్లందరికీ సమన్యాయం చేసే సత్తాలేకుంటే.. హక్కూ ఉండదు: షర్మిల
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే తెలుగువాళ్లందరికీ న్యాయం జరిగేలా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీని సూటిగా ఒకటే మాట అడుగుతున్నాం. మీరు న్యాయం(తెలుగువాళ్లందరికీ) చేయలేకపోతే, ఆ(విభజన) బాధ్యతనుకానీ, ఆ అధికారాన్ని కానీ ఎందుకు తీసుకున్నారు? అని అడుగుతున్నాం. మీపాటికి మీరు ఒక నిర్ణయం తీసేసుకొని ఇక ‘మీ ప్రాప్తం ఇంతే, మీ ఖర్మ ఇంతే’ అని మీ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజల మీద రుద్దితే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా?’’ అని ఆమె నిలదీశారు. ‘‘వైఎస్సార్ రాష్ట్రాన్నంతా సమానంగా ప్రేమించారు. ప్రతి తెలుగు కుటుంబం సంతోషంగా ఉండాలని తపించారు. రాజశేఖరరెడ్డి పేరు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్మోహన్రెడ్డి కూడా తెలుగు ప్రజలంతా తన కుటుంబమేనని ఎన్నోసార్లు చెప్పారు. తెలుగు ప్రజల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు జగన్మోహన్రెడ్డి. ఆయన ఉద్దేశం ఒకటే ఒకటి.. తెలుగువాడు అనే ప్రతివాడూ సంతోషంగా ఉండాలి. తెలుగువాళ్లందరికీ సమాన న్యాయం ఉండాలి. తెలుగువాళ్లందరికీ సమాన హక్కులు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ చెప్తున్నాం.. తెలుగువాళ్లందరికీ న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే, ఆ బాధ్యతను, ఆ అధికారాన్ని తీసుకునే హక్కు మీకు ముమ్మాటికీ లేదు’’ అని ఆమె ఉద్ఘాటించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ముగింపు సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఎత్తుగడ.. ‘‘కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ల రాజకీయ లబ్ధి కోసం మన రాష్ట్రాన్ని తలకాయ ఒకరికి, మొండెం ఒకరికి అని విడగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇలా పైభాగం ఒకరికి, కింది భాగం ఒకరికి అని ఇస్తే, కిందిభాగం వారికి సాగునీరు కాదు కదా.. కనీసం తాగునీరు కూడా దిక్కుండదని తెలిసి కూడా ఈ పాపానికి పూనుకుంది. ఇప్పటికే మహారాష్ట్రలో వాళ్ల అవసరాలు తీరాక, కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం నిండితే తప్ప కింద ఉన్న మన రాష్ట్రానికి నీళ్లు ఇవ్వని తీరును చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏమార్పులూ చేయకుండానే మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని సృష్టిస్తే ఇక శ్రీశైలం పాజెక్టుకు, నాగార్జున సాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామని అంటున్నారు. కానీ ఆ పోలవరానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పడం లేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడున్నాయి? ఇలా సీమాంధ్రను విడగొడితే ఈప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో, అసలు ఈ ప్రాంతం ఒక మహా ఎడారిగా అయిపోతుందనే కనీస ఇంగితం ఈ నాయకులకు లేదు అనుకోవాలా? లేకపోతే సీమాంధ్ర ఎడారి అయిపోయినా ఫర్వాలేదు, తమకు తెలంగాణలో 15 సీట్లు వస్తే చాలు అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలా? రాజధానిలో భాగం ఎందుకు ఉండకూడదు? గతంలో మద్రాసును తీసేసుకున్నారు, తరువాత హైదరాబాద్‌ను అందరూ కలిసి కట్టుకుంటే 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని కూడా తీసేసుకుంటారా? హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి అయిందంటే అందులో సీమాంధ్రుల కృషి లేదా? మరి సీమాంధ్రులకు హైదరాబాద్‌లో ఎందుకు భాగం ఉండకూడదు? విభజన జరక్కముందే కేసీఆర్ సీమాంధ్ర వాళ్లు వెళ్లిపోవాలి అంటున్నారంటే, ఇక విభజన జరిగిన తరువాత హైదరాబాద్‌లో సీమాంధ్రులు బతకడం అంటే పాకిస్థాన్‌లో బతికినంత కష్టం అయిపోదా? విశాల భారతదేశంలో ఏ పౌరునికైనా, ఎక్కడైనా బతికే హక్కులేదా? ఇలా నీళ్లూ ఇవ్వక, హైదరాబాద్ ఇవ్వక ప్రతి విషయంలో అన్యాయం చేస్తే కింది ప్రాంతం వాళ్లు ఎలా బతుకుతారు అనుకున్నారు? గాజులు తొడుక్కున్నారా? గాడిదలు కాస్తున్నారా? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు ఇంత మంది సీమాంధ్రులుగా ఉండి కూడా.. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయం మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదూ అంటే పదవుల కోసం వీళ్లు ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెట్టారో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మొత్తం విషయంలో ప్రజల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే అది కేవలం జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ల నిరసన తెలియజేయటానికి రాజీనామాలను ఎప్పుడో ఇచ్చారు. కానీ ఎంత మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు ఇచ్చారు? ఎంత మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తారు? వీళ్లందరూ ఏం చేస్తున్నారు? గాజులేసుకొని కూర్చున్నారా? లేక గాడిదలు కాస్తున్నారా? అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకంటే వీళ్లకు పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోట్లు పొడిచిన ఇలాంటి వారిని నాయకులు అనాలా? లేక రాక్షసులు అనలా? ఈ తరం కాదు కదా.. భవితరాలు, తరతరాలు ఎప్పటికైనా క్షమిస్తాయా అంటే ఎప్పటికీ క్షమించరు. అబద్ధాలకు మారుపేరు చంద్రబాబు.. మోసం, వెన్నుపోట్ల నుంచి పుట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈయన రైతులను మంచి హైటెక్ ముఖ్యమంత్రి అనిపించుకొని ఆనందించారు. పన్నుల మీద పన్నులు పెంచి ప్రజలను కాల్చుకుతిన్నారు. శాకాహారిగా మారానని చెబుతూ.. చెరువులో ఒంటికాలు మీద జపం చేసి ఆ చెరువులో ఉన్న చేపలన్నిటినీ తినేసిన మాయకొంగ లాంటి వాడు ఈ చంద్రబాబు నాయుడు. వేల కొద్దీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, లక్షలాది మంది పొట్టచేత పట్టుకొని వలసలు పోతుంటే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న చంద్రబాబు ఏ ఒక్కరోజూ కారణాలు వెతకలేదు. తలతిప్పి వారి వైపు చూడలేదు. ఇప్పుడు మన రాష్ర్టం రెండు ముక్కలైపోతున్నా, ప్రతి విషయంలో అన్యాయం జరుగుతున్నా చంద్రబాబునాయుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే ఈయనను నాయకుడు అనలా? లేక ఖల్నాయకుడు అనుకోవాలా? రూ.4 లక్షల కోట్లు ఇవ్వండీ, హైదరాబాద్‌ను తీసేసుకోండని, హైదరాబాద్‌ను కూడా అమ్మకానికి పెట్టారు అంటే ఈయన్ను ఏమనుకోవాలి? కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా కాంగ్రెస్ పార్టీని ఏమీ అనటం లేదూ అంటే, కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా వారి పక్షాన నోరు విప్పలేదు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో ఏ స్థాయిలో కుమ్మక్కయ్యారో అర్థమైపోతోంది. చంద్రబాబుకి అధికారమివ్వడమంటే.. తెలుగుదేశం పార్టీ బతికే ఉందో చనిపోయిందో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 2009 నుంచి ఇప్పటి వరకు 50 అసెంబ్లీ స్థానాల్లో, రెండు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే వాటిలో ఈ పార్టీ ఒక్కటంటే ఇక్క స్థానం గెలుచుకోలేదు. ఇదీ చంద్రబాబు సత్తా. వేరే ఏదైనా రాజకీయ పార్టీ అయితే ఇన్ని వరుస ఓటములకు అధ్యక్షుడిని ఎప్పుడో ఇంటికి పంపేసేవారు. కానీ టీడీపీ, ఎల్లో మీడియాకు చంద్రబాబు కంటే వేరే దిక్కేలేదు. అందుకనే ఈ బాబును ఇంకా భుజాన వేసుకొని మోస్తున్నారు. హరిశ్చంద్రుడు ఎప్పటికీ అబద్ధం చెప్పడు అన్నది ఎంత వాస్తవమో, చంద్రబాబు నిజం చెప్పరు అన్నది కూడా అంతే వాస్తవం. ఇలాంటి చంద్రబాబు తనకు అధికారం ఇస్తే మన రాష్ట్రాన్నే కాదు.. దేశాన్నే గాడిలో పెడతాను అంటున్నారు. ఈ చంద్రబాబుకు అధికారం ఇవ్వడం అంటే ఒక నరకాసురునికో, హిట్లర్కో మళ్లీ అధికారం ఇచ్చినట్టే. బాబుకు మళ్లీ అధికారం ఇవ్వడం అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే. టీఆర్ఎస్ విలీనమంటే.. క్విడ్ ప్రో కో కాదా? 2009లో వైఎస్సార్ ఎలా మరణించారు అన్నది ఈ రోజు వరకు అంతుపట్టని విషయం. ఆలాగే జగన్మోహన్రెడ్డి ఎందుకు అరెస్టు అయ్యారో ఈ రోజు వరకు అంతు పట్టని విషయమే. నిజానికి ఏ నేరం జరుగలేదు, నేరాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అభియోగాలు మోపారు, అబద్ధపు కేసులు పెట్టారు. 26 జీవోల కేసులో కోర్టు నోటీసులు ఇచ్చినపుడు జగన్మోహన్రెడ్డి 52వ రెస్పాండెంటు. మంత్రులు, అధికారులు 1 నుంచి 15 వరకు రెస్పాండెంట్లుగా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే 52వ రెస్పాండెంటు జగన్మోహన్రెడ్డిని అరెస్టు చేశారు. 1 నుంచి 15 రెస్పాండెంట్లుగా ఉన్న మంత్రులు, అధికారులు ఇంకా స్వేచ్ఛగా పదవులు అనుభవిస్తున్నారు. ఈ కేసులో జగన్మోహన్రెడ్డి ఏ1గా ఉంటారని, ఆడిటర్ సాయిరెడ్డి ఏ2గా ఉంటారని ఏ విచారణాప్రారంభం కాకముందే సీబీఐ అధికారి చెప్పారు. అంటే ఈ సీబీఐ కేసును ఎలా నడపదలుచుకుందో ఆ రోజే అర్థమయింది. దీన్ని దర్యాప్తు అంటారా? లేక దిక్కు మాలిన కుట్ర రాజకీయాలు అంటారా? 26 జీవోలు ప్రభుత్వం ఇస్తే జగన్మోహన్రెడ్డి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. జగన్మోహన్రెడ్డి మీద శంకర్రావు కేసు పెట్టిన తరువాత ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడినందుకు ప్రతిఫలంగా ఆయన మీద ఏ కేసుల్లో కూడా విచారణ జరుపకపోవడం క్విడ్ ప్రో కో కాదా? ఇన్నేళ్ల తరువాత ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలుపుకోవడం కోసం తెలంగాణ ఇస్తున్నామని చెప్తున్నారే ఇది క్విడ్ ప్రో కో కాదా? అని ప్రశ్నిస్తున్నాం.’’ -
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 21st july 2013
-
సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలోకి షర్మిళ
-
బొత్సను జిల్లా ప్రజలే ఈసడించుకుంటున్నారు: షర్మిల
-
షర్మిల పాదయాత్రకు ప్రపంచ రికార్డు
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 16th july 2013
-
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రనేడు సాగేదిలా
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 12th july 2013
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 11th july 2013
-
దర్యాప్తుకు ముందే డిసైడ్ చేశారు