మహానేత తనయ షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తమకు ఎంతో ధైర్యం ఇచ్చిందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ అన్నారు. షర్మిలమ్మ పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్‌ఆర్ టూరిజం పార్కు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జగనన్న వదిలిన బాణంగా ఈ పాదయాత్రను రికార్డు స్థాయిలో నిర్వహించినందుకు ఆమెకు శిరసువంచి నమస్కరిస్తున్నానన్నారు. ఇచ్ఛాపురంలొ పాదయాత్ర ముగించడం గర్వంగా ఉందన్నారు. నరనస్నపేట ఎమ్యెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని, జగన్ నాయకత్వంలో రాజన్న రాజ్యం తేచ్చి ఆ సమస్యలు పరిష్కరించడానికి గాను షర్మిలమ్మ పాదయాత్ర సంధానకర్తగా ఉంటుందన్నారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం మాట్లాడుతూ మరో ప్రజాప్రస్థానం మహా ప్రజా ప్రస్థానమని అభివర్ణించారు. రాష్ట్రాన్ని విభజన చేసినా స్పందించిన కాంగ్రెస్ నాయకులు చీమూనెత్తురు ఉంటే వెంటనే పార్టీ నుంచిబయటకు రావాలన్నారు. పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొనడంతో జన్మధన్యమైందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ ఎండనక, వానక 230 రోజులు పాదయాత్ర చేసిన షర్మిలమ్మ మనోధైర్యానికి శిరసువంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. సమావేశంలో కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం.వి.కృష్ణారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర బాబు, ఎస్సీ సెల్ కన్వీనర్ సల్లా దేవరాజ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హనుమంతు కిరణ్ కుమార్, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డెపల్లి పద్మజ, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ వి.టి.నాయుడు, జిల్లా డాక్టర్ సెల్ కన్వీనర్ పైడి మహేశ్వరరావు, పలాస,శ్రీకాకుళం,పాలకొండ,రాజాం,ఆమదాలవలస,పాతపట్నం, టెక్కలి,ఎచ్చెర్ల సమన్వయకర్త వజ్జ బాబూరావు, వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, పాలవలస విక్రాంత్, కళావతి, పీఎంజే బాబు, కిల్లి రామ్మోహనరావు, బోడ్డెపల్లి మాధురి, కలమట వెంకటరమణ, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, పలాస నాయకుడు దువ్వాడ శ్రీధర్, మాజీ ఎమ్యెల్యే కంభాల జోగులు, ఎచ్చెర్ల మాజీ ఎంపీపీ బి.జనార్దనరెడ్డి,హేమమాలిన రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోత మురళిధర్, పిరియా విజయ, కూన మంగమ్మ,ధర్మాన ఉదయభాస్కర్, నియోజకవర్గ కన్వీనర్లు పిలక పోలారావు, కారంగి మోహనరావు, మేరుగు వెంకటరెడ్డి, పిట్ట ఆనంద్, చత్రపతి, పి.కోటి, నాయకులు జి.తారక్,పిఎం.తిలక్, ధవళ గరిబాబు,జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పాదయాత్ర ధైర్యాన్నిచ్చింది
Published Mon, Aug 5 2013 6:04 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement