వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. పాదయాత్ర 216వ రోజు(జిల్లాలో తొలిరోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు శనివారం ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వీరఘట్టం మండలం కెల్ల గ్రామం వద్ద పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ సభ ముగిసిన అనంతరం నడిమికెల్ల గ్రామం మీదుగా విక్రమపురం చేరుకుంటుంది. ఈ గ్రామానికి సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు. జిల్లాలో తొలిరోజు పర్యటించే ప్రాంతాలు కెల్ల, నడిమికెల్ల, విక్రమపురం
Published Sun, Jul 21 2013 1:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement