Vijaya nagaram
-
విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలి : మంత్రి బొత్స సత్యనారాయణ
-
లేనిది ఉన్నట్టు ఎల్లో డప్పులు...
-
బడుగుజీవులకు ఆరోగ్య భరోసా !
పేదవాడికి సుస్తీ చేస్తే బంగారం, ఇల్లు, భూమి తాకట్టుపెట్టి వైద్యం పొందే రోజుల్లో.. నేనున్నానంటూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి అంకురార్పణ చేశారు. ఆరోగ్య భరోసా కల్పించారు. పైసా ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువచేశారు. వేలాది మందికి పునర్జన్మ కల్పించారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు పథకంపై సవతితల్లి ప్రేమ చూపారు. పేదల్లో వైద్య భయాందోళనలు కలిగించారు. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను కొనసాగిస్తూనే ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. ఈ నెల 8న నిర్వహించే వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తండ్రీతనయుల ప్రజారోగ్య పాలనను జనం గుర్తుచేసుకుంటున్నారు. సాక్షి,విజయనగరం : కార్పొరేట్ ఆస్పత్రుల వైపు చూడడానికే పేద, మధ్య తరగతి ప్రజలు భయపడే రోజులవి. ఆరోగ్యం పాడైతే మంచానికే పరిమితమై కాలం చేయాల్సిన దుస్థితి. వీటిని పాదయాత్రలో కళ్లారా చూసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి... ప్రతీ పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలని తలచారు. అధికారంలోకి వచ్చాక 2007లో ఆరోగ్యశ్రీ పథకానికి అంకురార్పణ చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు పేదలకు ఎదురొచ్చి మా ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటూ స్వాగతం పలికే పరిస్థితులను సృష్టించారు. క్యాన్సర్, కిడ్నీవ్యాధులు, గుండె సంబంధిత రోగులు గుండెమీద చెయ్యివేసుకుని జీవించేలా వైద్య భరోసా కల్పించారు. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. మరిన్ని జబ్బులను పథకంలో చేర్చి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వాటితో పాటు ఆరోగ్య ఆసరా పేరిట రోగులు కోలుకునేవరకు ఆర్థిక భృతిని అందజేస్తున్నారు. అపర సంజీవిని 108... ఆరోగ్యశ్రీవలే ఆపదవేళ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్ 108 సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రమాదంలో చిక్కుకున్నామని ఫోన్ చేసిన 15–20 నిమిషాల్లో కుయ్‌కుయ్ అంటూ సంఘటనా స్థలానికి 108 వచ్చి క్షణాల్లో ఆస్పత్రికి చేర్చుతోంది. వాహన సేవలతో చాలా వరకు ప్రమాద మరణాలు తగ్గాయి. జిల్లాలో 108 అంబులెన్సులు 36 ఉన్నాయి. వీటిలో 2 నియోనేటల్ అంబులెన్సులు, 24 బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా నియోనేటల్ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. -
పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ
విజయనగరం గంటస్తంభం: సాధారణ ఎన్నికల కౌంటింగ్ పక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. హరి జవహర్లాల్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ తీవ్రతను గుర్తించి అందుకు అనుగుణంగా బాధ్యతగా లెక్కింపు చేపట్టాలన్నారు. ఈనెల 23న జరగనున్న కౌంటింగ్‌కు సంబంధించి ఏఆర్ఓలు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో గురువారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను ఆకళింపు చేసుకోవాలన్నారు. పోలింగ్ పక్రియ కంటే కౌంటింగ్ పక్రియ భిన్నంగా ఉంటుందన్నారు. కౌంటింగ్ పక్రియను ఎన్నికల కమిషన్ కూడా పరిశీలిస్తుందని చెప్పారు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండే దుస్తులు వేసుకోకుండా ఉండాలని.. కౌంటింగ్ ఏజెంట్లు ఎంత పరిచయస్తులైనా వారితో అధిక సమయం సంభాషించకూడదని సూచించారు. దీనివల్ల రాజకీయ పక్షాల నాయకులకు అనుమానాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఎటువంటి సమస్యలెదురైనా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గుర్తింపు కార్డులు లేని పక్షంలో ఎట్టిపరిస్థితుల్లో లోపలకు అనుమతించరని, మూడు అంచెల్లో పోలీస్ తనిఖీలు ఉంటాయన్నారు. అలాగే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జె. వెంకటరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘రాష్ట్రంలో లేని పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటాం’
విజయనగరం, సాలూరు: రాబోవు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీఆర్ఎస్తో వైఎస్సార్సీపీ పొత్తు పెట్టుకుట్టుందని టీడీపీ నాయకులు ప్రచారం చేయడం నిజంగా శోచనీయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో లేని పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటామని ఈ సందర్భంగా రాజన్న దొర ప్రశ్నించారు. తమ పార్టీ 175 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుపై రాజన్న దొర మండిపడ్డారు. ఆయన పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతూ తాను చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలైన తృణమూలు కాంగ్రెస్, డీఎంకే, ఎస్పిలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపిన మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారని రాజన్న దొర పేర్కొన్నారు. -
తొలి పార్లమెంటేరియన్ తిలక్ కన్నుమూత
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, మొదటి పార్లమెం టేరియన్ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ (98) శుక్రవారం అక్కయ్య పాలెంలోని తన కుమారుడి ఇంట మధ్యాహ్నం 12.48 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయ నకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య సూర్యకాంతం 2015లో కన్ను మూశారు. అప్పటి నుంచి కుమారుడు వద్ద ఉంటున్నారు. ఈయన విద్యాభ్యాసం మహారాజా కాలేజీ, బెనారస్ కళాశాల, బెల్గాంలలో సాగింది. గ్రాడ్యు యేషన్ పూర్తిచేసి, న్యాయవిద్యలో పట్టభద్రు లయ్యారు. తొలి పార్లమెంట్ ఏర్పడిన 1952 నుంచి 1957 వరకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తిలక్ ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ఈయన దేశంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన వారిగా గుర్తింపు పొందారు. మొదట్లో కాంగ్రెస్ ద్వారా రాజకీ యాల్లో ప్రవేశించినా తదనంతరం సోషలిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై సోషలిస్టు పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. పార్ల మెంట్‌కు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో నాటి ప్ర«ధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. ఇంతవరకు జీవించి ఉన్న తొలి పార్లమెంటే రియన్ ఈయన ఒక్కరే. కాగా, తిలక్ పార్థివ దేహాన్ని ఆయన కోరిక మేరకు గాయత్రి వైద్య కళాశాలకు అందజేయనున్నట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. తిలక్ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. -
రేకు పడవ బోల్తా : ఇద్దరి మృతి
నందివాడ (గుడివాడ) : చేపల చెరువులో రేకు పడవ బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మండలంలోని తమిరిశ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుడివాడకు చెందిన కత్తుల సత్యనారాయణ (40) తమిరిశలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు సాగు చేస్తున్నాడు. చెరువులో మందు చల్లటం కోసం గురువారం రేకు పడవపై విజయనగరం జిల్లా కొమరాడ మండలం గున్ననపురం గ్రామానికి చెందిన వలస కూలీలు బొండుపల్లి ఆదినారాయణ (34), మంగమ్మ (32) లను తీసుకువెళ్లాడు. చెరువు మధ్యలోకి వెళ్లగానే నీటితో కలిసిన మందు కావటంతో పడవ ఊగటం ప్రారంభమైంది. భయపడిన పడవలోని ముగ్గురూ అటూఇటూ కదలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న ముగ్గురు చెరువులో పడిపోయారు. చెరువు యజమాని కత్తుల సత్యనారాయణ గల్లంతుకాగా, వలస కూలీ ఆదినారాయణ ఈదుకుంటూ మంగమ్మను కూడా రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. చాలా దూరం ఈదటం వల్ల ఆదినారాయణ ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయాడు. చుట్టుపక్కల చేపల చెరువులో పని చేసే కూలీలు వచ్చి గాలింపు చర్యలు చేపట్టడంతో సుమారు గంట తర్వాత పడవ బోల్తా పడిన ప్రాంతంలోనే కత్తుల సత్యనారాయణ మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న నందివాడ ఎస్సై ఎ.మణికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రైలు కింద పడి ఒకరి మృతి
బొబ్బిలి: మండలంలోని దిబ్బగుడివలస రైల్వే గేటు వద్ద రైలు కిందపడి ఒకరు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై సీహెచ్‌ఎల్‌ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మక్కువ మండల కేంద్రానికి చెందిన బొద్దాన కాశి (38) మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. దిబ్బగుడివలస గేటు, సీతానగరం మధ్యలో ఇతను మృతి చెంది ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పరిశీలన
కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ముంపునకు గురైన రహదారిని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో వరద తాకిడి ఎక్కువ కావడంవల్ల విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజిన్లో గల కొమరాడ , గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాలలో నాగావళి నది ప్రాంతాలకు చెందిన ఈ మూడు మండలాలు ముంపునకు గురైయ్యాయని చెప్పారు. తోటపల్లి వంతెన వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోందని, పలు గ్రామాలలో నీటి ప్రవాహం తగ్గి రాకపోకలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులను బాగుచేస్తాం అని ఆయన తెలిపారు. -
విభజన చిచ్చుపెట్టింది సోనియానే: బాబు
-
విభజన చిచ్చుపెట్టింది సోనియానే: బాబు
సాక్షి, విజయనగరం: ‘‘వెన్నుపోటు పొడవాలనుకునే భావనలు ఉన్న వారే గాడ్సేలు.. ఆ గాడ్సేయే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. అన్నదమ్ముల్లా కలసి ఉన్న వారి మధ్య విభజన చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు.. దేశంలో అన్ని సమస్యలకు సోనియానే కారణం. దేశంలో సోనియా అతిపెద్ద అవినీతి అనకొండ.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలి. ఆ పార్టీ నేతలంతా దుర్మార్గులు.. వాళ్లను సంఘ బహిష్కరణ చేయాలి...’’ అంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారం సాయంత్రం విజయనగరంలోని అయోధ్య మైదానంలో ప్రజాగర్జన పేరుతో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్రులను ఒప్పించండి.. సమైక్యాంధ్ర ఉండాలంటే తెలంగాణ వాళ్లను మెప్పించండని చెప్పా. కానీ సోనియాగాంధీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టింది’’ అని సోనియాపై ఆరోపణలు గుప్పించారు. ‘‘తెలుగు జాతి ఐక్యత కోసం ఢిల్లీలో ఉంటున్న పెద్దలను పదిసార్లు కలిశాను. సమధర్మం చేయమన్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రాధేయపడ్డాను. ముఖ్యంగా బీజేపీ నుంచి నేనెంతో ఆశించాను.. కానీ అన్యాయం చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం ఆ పార్టీ పార్లమెంటులో పోరాడలేదు’’ అని బీజేపీని కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఈ దుర్మార్గులు ఇప్పుడు అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. ఆరు నెలలు ఆగండి మేమే అభివృద్ధి చేస్తాం’’ అని పేర్కొన్నారు. ‘‘ఎన్ని సమస్యలున్నా ఇటు సీమాంధ్రను, అటు తెలంగాణను నేనే నిర్మిస్తా.. పూర్వవైభవాన్ని తీసుకొస్తా.. రెండు సార్లు ప్రధాని అవకాశం వస్తే మీ కోసం వదలుకున్నా. నాకు పదవులు ముఖ్యం కాదు. నేనిప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడడం లేదు. మీ కష్టాలను తీర్చేందుకే నడుంకట్టాను’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై ఆలోచన ఏమైనా ఉందా? అని గవర్నర్ తనకు ఫోన్ చేసి అడిగారని.. తాను గట్టిగా బదులిచ్చానని చెప్పారు. ఏదైనా చట్టబద్ధంగా జరగాలని చెప్పానని.. లేదంటే ‘మిమ్మల్ని వదిలిపెట్టను’ అని చెప్పానని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఏది జరిగినా దానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే కారణమని బాబు విమర్శించారు. ‘‘జిల్లాను ఏకంగా లూటీ చేశాడు, లిక్కర్, ఇసుక, భూమాఫియాలు చేసి దందా నడిపాడు’’ అని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో ఉన్న పలు మీడియాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇందంతా ఒక ప్యాకేజీ అని, దానిని నమ్మవద్దని ప్రజలతో పేర్కొన్నారు. కేసీఆర్ క్యారెక్టర్ లేని వ్యక్తి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు క్యారెక్టర్ లేని వ్యక్తి అని, బ్లాక్మెయిల్ ఉద్యమాలు నడిపారని చంద్రబాబు అన్నారు. విజయనగరంలో బుధవారం జరిగిన ప్రజాగర్జన సభ అనంతరం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని తప్పుడు లెక్కలు వేయడంతో పాటు, దొంగమాటలు ఆడడంలో కేసీఆర్ మొదటి వరుసలో నిలుచుంటారని మండిపడ్డారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కార్యకర్తలే కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ వాళ్లు వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లే ప్రమాదముందని, వారిని కలుపుకుపోవాలని సూచించారు. అయితే దీనిపై కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు బొత్స, షాడోనేతలు తమను వేధించారని, ఇప్పుడు వారితో ఎలా కలిసి వెళతామని జామి మండలం తాండ్రంగి గ్రామానికి చెందిన రవి ప్రశ్నించారు. సమస్యలున్నా సర్దుకుపోవాలని బాబు సమాధానమిచ్చారు. -
రంగారెడ్డి జిల్లా ‘ట్రిపుల్’
సాక్షి, విజయనగరం: ఏపీ రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ రంగారెడ్డి మహిళల జట్లు సత్తా చాటాయి. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో మహిళల సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాలు మూడింటిలోనూ రంగారెడ్డి టీమ్ చాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. మహిళల కేటగిరీలో పై మూడు విభాగాల్లో తూర్పుగోదావరి జిల్లానే రన్నరప్‌గా నిలిచింది. పురుషుల విభాగంలో సీనియర్లో విజయనగరం, జూనియర్లో తూర్పు గోదావరి, సబ్ జూనియర్లో కర్నూలు జట్లు టీమ్ చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకోగా...జూనియర్లో కర్నూలు, సీనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో తూర్పు గోదావరి జట్లు రన్నరప్ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగం మూడు కేటగిరీల్లో ఎం. రామకృష్ణ, ఎస్. రామ్మోహన్రావు, పారపాటి రమేశ్‌లకు బెస్ట్ లిఫ్టర్ల అవార్డు దక్కింది. మహిళల విభాగంలో కె. వెంకటలక్ష్మి, కె. శిరీష, టి. ప్రియదర్శినిలు ఉత్తమ లిఫ్టర్లుగా నిలిచారు. -
బదిలీల గోల
సాక్షి ప్రతినిధి, విజయనగరం : సొంత జిల్లాలో పనిచేస్తున్నారా? మూడేళ్లుగా జిల్లాలోనే ఉన్నారా?...అయితే బదిలీ తప్పదు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరగనున్నాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులపైనే కాకుండా ఈసారి ఎంపీడీఓలను కూడా బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిం ది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. దీంతో పలువురు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎంపీడీఓలకూ... ఎన్నికల వేళ అధికారులు సొంత జిల్లాలో పనిచేస్తే పక్షపాతంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతిసారీ రెవెన్యూ, పోలీస్ అధికారుల్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టుగానే రంగం సిద్ధమవుతోంది. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనుండడంతో ప్రక్రియ ఊపందుకుంది. ఈసారి బదిలీ జాబితాలోకి ఎంపీడీఓలు కూడా చేరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హోదాలో పనిచేస్తున్నందున ఎంపీడీఓలను కూడా బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లు పూర్తయితే.... ఈ క్రమంలో 2014 మే 31 నాటికి జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు సొంత జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ, పోలీస్, ఎంపీడీఓలందరికీ బదిలీ తప్పదు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. బదిలీ కావల్సిన వారి జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా 42 మంది తహశీల్దార్లకు స్థానచలం అయ్యే అవకాాశం ఉంది. అలాగే డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, ఎన్నికలతో సంబంధం ఉన్న మిగతా రెవెన్యూ అధికారులందరికీ బదిలీ కానుంది. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 28 ఎంపీడీఓలకు బదిలీ జరగనుంది. ఇదే తరహాలో సీఐ, ఎస్ఐ హోదాలో పనిచేస్తున్న 15మందికి బదిలీ కావొచ్చు. రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలకైతే జిల్లా దాటి బదిలీ చేయనున్నారు. పోలీస్ అధికారులకూ స్థాన చలనం కలగనుంది. ఇదిలా ఉండగా 2014మే 31నాటికి ఆరు నెలల్లోపు రిటైరైన వాళ్లు ఉంటే వారికి ఎన్నికల సంఘం బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాంటి వారందర్నీ ఎన్నికలకు దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తమ మార్గదర్శకాలు, ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా పరిషత్ సీఈఓకూ స్థానచలనం ? జిల్లా పరిషత్ సీఈఓ సీ.మోహనరావుకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. విశాఖ జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఆ జిల్లాలో మూడేళ్లు పూర్తి చేసుకోవడంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బదిలీ కావల్సి ఉంటుంది. ఈ క్రమంలో వెంకటరెడ్డి పక్క జిల్లాలపై దృష్టి సారించారు. ఇక్కడ పనిచేస్తున్న మోహనరావు కూడా బదిలీపై వెళ్లిపోవాలన్న ఆసక్తితో ఉన్నారని తెలుసుకున్నట్టు సమాచారం. జిల్లాలో మూడేళ్లు పూర్తి కాకపోయినప్పటికీ స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులు దృష్ట్యా మోహనరావు వీలైనంత తొందరగా బదిలీ చేయించుకోవలన్న యోచనలో ఉన్నారని తెలుసుకున్న విశాఖ సీఈఓ వెంకటరెడ్డి ఆయనతో సంప్రదింపులు చేసినట్టు తెలిసింది. వీరిద్దరూ లోపాయికారీ ఒప్పందంతో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాల దృష్ట్యా వెంకటరెడ్డి ఇక్కడికి, మోహనరావు వైజాగ్‌కి వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. -
నేడు విజయనగరానికి బొత్స సత్యనారాయణ
-
ఎక్కడి నుంచి యాత్ర మెదలు పెట్టాలో తెలియక సతమతం
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 21st july 2013
-
సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలోకి షర్మిళ
-
బొత్సను జిల్లా ప్రజలే ఈసడించుకుంటున్నారు: షర్మిల
-
షర్మిల పాదయాత్రకు ప్రపంచ రికార్డు
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 16th july 2013
-
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రనేడు సాగేదిలా
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 12th july 2013
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 11th july 2013