ముంపు ప్రాంతాల్లో కలెక‍్టర్ పరిశీలన
Published Mon, Jul 17 2017 12:36 PM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM
కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ముంపునకు గురైన రహదారిని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర‍్బంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో వరద తాకిడి ఎక్కువ కావడంవల‍్ల విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజిన్‌లో గల కొమరాడ , గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాలలో నాగావళి నది ప్రాంతాలకు చెందిన ఈ మూడు మండలాలు ముంపునకు గురైయ్యాయని చెప్పారు. తోటపల్లి వంతెన వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోందని, పలు గ్రామాలలో నీటి ప్రవాహం తగ్గి రాకపోకలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులను బాగుచేస్తాం అని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement