తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, మొదటి పార్లమెం టేరియన్ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ (98) శుక్రవారం అక్కయ్య పాలెంలోని తన కుమారుడి ఇంట మధ్యాహ్నం 12.48 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయ నకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య సూర్యకాంతం 2015లో కన్ను మూశారు. అప్పటి నుంచి కుమారుడు వద్ద ఉంటున్నారు. ఈయన విద్యాభ్యాసం మహారాజా కాలేజీ, బెనారస్ కళాశాల, బెల్గాంలలో సాగింది. గ్రాడ్యు యేషన్ పూర్తిచేసి, న్యాయవిద్యలో పట్టభద్రు లయ్యారు.
తొలి పార్లమెంట్ ఏర్పడిన 1952 నుంచి 1957 వరకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తిలక్ ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ఈయన దేశంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన వారిగా గుర్తింపు పొందారు. మొదట్లో కాంగ్రెస్ ద్వారా రాజకీ యాల్లో ప్రవేశించినా తదనంతరం సోషలిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై సోషలిస్టు పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. పార్ల మెంట్‌కు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో నాటి ప్ర«ధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. ఇంతవరకు జీవించి ఉన్న తొలి పార్లమెంటే రియన్ ఈయన ఒక్కరే. కాగా, తిలక్ పార్థివ దేహాన్ని ఆయన కోరిక మేరకు గాయత్రి వైద్య కళాశాలకు అందజేయనున్నట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. తిలక్ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment