tilak
-
చంద్రబాబు సహా వాళ్లంతా కుంభకోణాల్లో నిందితులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 మధ్య జరిగిన పలు భారీ కుంభకోణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కింది కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లను, ఆ కేసుల డైరీలను కోర్టు ముందుంచేలా సీఐడీ అదనపు డీజీని ఆదేశించాలని కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేశ్, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తిమంతమైన స్థానాల్లో ఉన్నారని, అందువల్ల కేసు డైరీల్లోని కీలక ఆధారాలను, సాక్ష్యాలను చెరిపేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు.2014–19 మధ్య జరిగిన పలు కుంభకోణాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తిలక్ పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, దర్యాప్తు సంస్థలన్నీ చంద్రబాబు తదితరులకు క్లీన్‌చీట్ ఇచ్చి వారిపై నమోదైన కేసులన్నింటినీ మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నాయని అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. రూ.కోట్ల కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోందని, అందులో భాగంగా పలువురు నిందితుల ఆస్తులను కూడా జప్తు చేసిందని తెలిపారు. అధికారుల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు ‘ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు తదితరులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఐజీ, సీఐడీ అదనపు డీజీ, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు గవర్నర్‌ను కోరగలరు. అయితే వీరంతా చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారుల పనితీరు మదింపు నివేదికలు (ఏపీఏఆర్) ఆమోదించే అధికారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దే ఉంది. అధికారులను బదిలీ చేసే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), శాంతి భద్రతల విభాగం కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రిగా ఆ కుంభకోణాలపై దర్యాప్తు చేసిన అధికారుల వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఇది నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమపై నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను చంద్రబాబు తదితరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన మధుసూదన్‌రెడ్డి అనే అధికారిని అకారణంగా సస్పెండ్ చేశారు. దీనిపై మధుసూదన్‌రెడ్డి న్యాయపోరాటం చేసి తిరిగి ఉద్యోగం పొందారు. తనపై ఫిర్యాదు చేసిన అధికారులపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారనేందుకు ఇదో ఉదాహరణ. అంతేకాక ఆ కుంభకోణాలపై నిష్పాక్షికంగా, వృత్తిపరంగా దర్యాప్తు చేసిన, దర్యాప్తులో పాలుపంచుకున్న పలువురు అధికారులకు ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కనపెట్టారు’ అని తిలక్ వివరించారు.ముఖ్యమంత్రి సహా ఇప్పుడున్న 25 మంది మంత్రుల్లో ఐదుగురు ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా కూడా ఈ నిందితుల నియంత్రణలో పనిచేస్తున్నారు. సీఐడీ దర్యాప్తు కొనసాగించినా కూడా నిందితులుగా ఉన్న వీరిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కోరే ఆస్కారమే లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చైర్మన్‌గా ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఆర్డీఏ పురపాలక శాఖ పరిధిలో పనిచేస్తుంది. దానికి నారాయణ మంత్రిగా ఉన్నారు. సీఆర్డీఏకు నారాయణ వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.వీరిద్దరూ ఆ కుంభకోణాల్లో నిందితులు. సీఆర్డీఏ, పురపాలక శాఖ అధికారులందరూ వీరి నియంత్రణలో పనిచేస్తున్నారు. ఇప్పటికే కొందరి సాక్ష్యాలను కింది కోర్టు నమోదు చేసింది. మరికొందరి సాక్ష్యాలు నమోదు చేయాల్సి ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద కోర్టుకు సమర్పించిన అన్నీ రికార్డులను చంద్రబాబు, నారాయణ పరిశీలించే అవకాశం ఉంది అని తిలక్ తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ బెదిరించేలా మాట్లాడుతున్నారు‘బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేశ్ ఉల్లంఘించారు. వారిపై నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలన్నీ కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా, అడ్డుకునేలా ఉన్నాయి. దర్యాప్తు అధికారులను భయపెట్టేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. కోర్టు ముందు సాక్ష్యం ఇచి్చన పలువురు అధికారులు తమ తప్పును అంగీకరించారు.క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కుంభకోణాల్లో పొందిన నగదు టీడీపీ ఖాతాలకు చేరింది. ఈ విషయంపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేశారా? చేస్తున్నారా? అన్న విషయాలు కేసు డైరీల్లో ఉంటాయి. ఏ కోణంలో చూసినా కూడా చంద్రబాబు తదితరులు అధికారులను, దర్యాప్తును శాసించే స్థానాల్లో ఉన్నారు. కాబట్టి వారిపై నమోదయిన కేసులకు సంబంధించిన కేసు డైరీలను, చార్జిషిట్లను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వండి’ అని తిలక్ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
పవన్ కు సీనియర్ జర్నలిస్ట్ తిలక్ స్ట్రాంగ్ కౌంటర్
-
ఇది చాలా దుర్మార్గం.. కేటీఆర్ ఎలాంటి మనిషంటే..
-
భక్తులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. పవన్ కు తిలక్ అదిరిపోయే కౌంటర్..
-
జత్వాని కేసుపై పెట్టిన ఫోకస్.. పూనమ్ కౌర్ కేసుపై అదే స్పీడ్ ఉండాలి..
-
బాబు అండ్ కో కేసులన్నీ సీబీఐ, ఈడీకి అప్పగించండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపార వేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నింటినీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు తదితరాల స్కామ్‌లకు సంబంధించి చంద్రబాబు, ఇతరులపై నమోదైన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని.. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సీనియర్ పాత్రికేయుడు, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాల గంగాధర తిలక్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని ఆయన తన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు. దర్యాçప్తు పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికలను కోర్టు ముందుంచేలా కూడా సీబీఐ, ఈడీలను ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో పాటు మొత్తం 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రతివాదుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, సీబీఐ, ఈడీలను కూడా చేర్చారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాను వ్యక్తి గత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. ఆయా కుంభకోణాల్లో అక్రమాలు ఎలా జరిగాయో కూడా సమగ్రంగా వివరించారు.సీఐడీ ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు ‘ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా, పోలీసు బలగాలకు అధిపతి (హెచ్‌ఓఎఫ్)గా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించారు. చంద్రబాబు తదితరులు అధికారంలోకి రాబోతున్నారని గ్రహించి, ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించారు. అంతేకాక మధ్యాహ్నం 12.30 గంటలకు రహస్యంగా సాయుధులను అక్కడ మోహరింప చేశారు. కౌంటింగ్ జరుగుతుండగానే, ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్లిపొమ్మన్నారు. ఈ విషయాలన్నీ పత్రికల్లో వచ్చాయి. ఓ డీజీపీ ఈ విధంగా చేయడం చట్ట విరుద్ధం, ఏకపక్షం, దౌర్జన్యపూరితం’ అని తిలక్ తన వ్యాజ్యంలో వివరించారు.ఆ కేసుల విషయంలో ఉదాసీనత స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసీఐఆర్‌ను రిజిష్టర్ చేసిందని తెలిపారు. కొందరు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపిందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ వివరించారు. ఈ కేసుల్లో సీఐడీ, ఈడీ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తును చంద్రబాబు, ఇతర నేతలకు అనుకూలంగా నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నింటి దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్ జి.వెంకట రెడ్డిపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్‌బుక్ అంటూ పలువురు అధికారులను వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. -
sri rama navami 2024: బాలరాముడికి సూర్య తిలకం
అయోధ్య: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య బాలరాముడికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్ది ఆశీస్సులందించాడు. సరిగ్గా నుదుటిన చుంబించి రఘుకుల పురుషోత్తముడి పట్ల ఆతీ్మయత చాటుకున్నాడు. భవ్య రామమందిరంలోని గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారిగా కనిపించిన ఈ అద్భుత దృశ్యాలను భక్తులు కనులారా తిలకించి పరవశించిపోయారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సమయంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక హారతి ఇచ్చారు. అరుదైన వజ్రాలు, రత్నాలు పొదిగిన కిరీటంతోపాటు ప్రత్యేక ఆభరణాల అలంకరణతో బాలరాముడు మరింత సుందరంగా మెరిసిపోయాడు. ప్రతిఏటా శ్రీరామనవమి సందర్భంగా రాముడికి 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యతిలకం దిద్దేలా ఆలయంలో దర్పణాలు, కటకాల సాయంతో ప్రత్యేక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సూర్యతిలకం దృశ్యం 4 నుంచి 5 నిమిషాల పాటు కొనసాగిందని ఆలయ ప్రతినిధి ప్రకాశ్ గుప్తా చెప్పారు. సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి విగ్రహం నుదుటి భాగంపైకి ప్రసరించాయని వెల్లడించారు. ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించలేదని అన్నారు. వారు బయటి నుంచే దర్శించుకున్నారని తెలిపారు. మరోవైపు, అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది దర్శనం కోసం బారులు తీరారు. భావోద్వేగపూరిత క్షణం: ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి తనకెంతో ఆనందంగా కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ రోజు కోస మే కోట్లాది మంది ఎదురుచూశారని వెల్లడించారు. అస్సాంలోని నల్బారీలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ బాలరాముడి సూర్యతిలకం ఘట్టాన్ని ఆన్లైన్లో వీక్షించి, భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి తరించానని చెప్పారు. కోట్లాది మంది ప్రజల్లాగే తనకు కూడా ఇది భావోద్వేగపూరిత క్షణమని వెల్లడించారు. -
‘సూర్య తిలక్’ వేడుక.. ట్యాబ్‌లో వీక్షించిన ప్రధాని
గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని సభలోని వారందరినీ సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ ఆన్ చేసి కాసేపట్లో జరిగే సూర్యతిలక్ ఉత్సవానికి సంఘీభావం తెలపాలని కోరారు. సెల్‌ఫోన్‌లైట్ కిరణాలు కూడా పంపాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘దేశ వాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరింది. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది తొలి రామ్ నవమి. కాసేపట్లో సూర్యతిలక్ వేడుక జరగనుంది. మీరందరూ మీ సెల్‌ఫోన్ లైట్లను వెలిగించండి.. జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలివ్వండి’అని ప్రధాని కోరారు. ర్యాలీ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న ట్యాబ్‌లో సూర్యతిలక్ వేడకను వీక్షించారు. ఈ దృశ్యాలను ఆయన తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు. #WATCH | PM Narendra Modi watched the Surya Tilak on Ram Lalla after his rally in Nalbari, Assam "Like crores of Indians, this is a very emotional moment for me. The grand Ram Navami in Ayodhya is historic. May this Surya Tilak bring energy to our lives and may it inspire our… pic.twitter.com/hA0aO2QbxF — ANI (@ANI) April 17, 2024 ఇదీ చదవండి..బాలరాముడికి సూర్య తిలకం -
15 ఏళ్ల బాలుడు.. రూ.100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే..
ఒక మంచి ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అవసరాలే సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఆ పరిష్కారాలను మంచి బిజినెస్ ఐడియాగా మలుచుకుంటే రాబడి పెరుగుతుంది.. జీవనోపాధి లభిస్తుంది. 15 ఏళ్ల ఓ బాలుడు తన సమస్యను పరిష్కరించుకునే క్రమంలో మంచి ఐడియాతో బిజినెస్ ప్రారంభించి ఏకంగా రూ.100 కోట్ల కంపెనీని సృష్టించాడు. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. బడికెళ్లే వయసులో కోట్లు విలువైన కంపెనీ నిర్మించటం అంత ఈజీ కాదు. వినటానికి కొంచెం వింతగానే అనిపిస్తున్నప్పటికీ ముంబైలో నివసిస్తున్న 15 ఏళ్ల గుజరాతీ బాలుడు తిలక్ మెహతా ఇది సాధ్యమని నిరూపించాడు. చదువుతో పాటు వ్యాపారాన్ని కొనసాగిస్తూ రెండేళ్లుగా విజయవంతంగా వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. తన సంస్థ ద్వారా దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తిలక్మెహతా 2008లో గుజరాత్లో జన్మించాడు. వృత్తిరీత్యా తిలక్ తండ్రి విశాల్ ముంబయి వచ్చి కుంటుంబంతో సహా అక్కడే నివసిస్తున్నారు. విశాల్ ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తుండేవారు. తల్లి గృహిణి. తిలక్‌కు సోదరి కూడా ఉంది. తిలక్‌కు తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ద్వారా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఒకరోజు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన తండ్రిని తనకు కావాల్సిన స్టేషనరీ వస్తువులను తీసుకురమ్మని అడిగాడు. అప్పటికే అలసటగా ఉన్న విశాల్ అందుకు నిరాకరించారు. దాంతో తనే వెళ్లి అవసరమైన వస్తువులు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడే తనకు మంచి ఐడియా వచ్చింది. తనలాగే ఎంతోమంది పిల్లలు, పెద్దలు కొన్ని కారణాల వల్ల వారికి అవసరమైన స్టేషనరీ వస్తువులు తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని గ్రహించాడు. దాంతో సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తూ.. ఇంటికే పుస్తకాలు డెలివరీ చేసే సర్వీస్ ప్రారంభిస్తే బావుంటుందనే ఐడియా వచ్చింది. వెంటనే ఈ ఆలోచన గురించి తండ్రికి వివరించాడు. అలా తిలక్ తన కొరియర్ సర్వీస్ ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి ప్రణాళిక సిద్ధమైంది. దీనికి అవసరమైన పెట్టుబడిని తన తండ్రి సమకూర్చారు. ఇదీ చదవండి: అది నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే: బాబా రామ్‌దేవ్ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో పెట్టుబడిదారుల కోసం వెతికారు. తండ్రి సహాయంతో తిలక్ ఓ బ్యాంకు అధికారికి తన వ్యాపారం గురించి వివరించాడు. దాంతో ఆ అధికారి తిలక్ ఆలోచన విని కొంత పెట్టుబడి పెట్టారు. తర్వాత బ్యాంకు ఉద్యోగం వదిలేసి తన వ్యాపారంలో చేరాడు. వీరంతా కలిసి ‘పేపర్స్ ఎన్ పార్సెల్స్’ పేరుతో కొరియర్ సర్వీస్‌ను ప్రారంభించారు. పేపర్స్ ఎన్ పార్సెల్స్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా షిప్పింగ్, లాజిస్టిక్స్ సేవలు అందిస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసిన అదేరోజు స్మాల్ పార్సెళ్లు, డాక్యుమెంట్లు, స్టేషనరీ వస్తువులు అందిస్తారు. ఈ కంపెనీ ముంబయిలో సేవలు అందిస్తోంది. ఇందులో 200 మంది పనిచేస్తున్నారు. దాదాపు 300 మంది డబ్బావాలా ఉద్యోగాల సహకారంతో రోజూ 1200 డెలివరీలు ఇస్తున్నారు. గరిష్ఠంగా 3 కిలోల వరకు బరువున్న పార్సెళ్లు చేస్తున్నారు. ప్రతి పార్సెల్‌కు కనీసం రూ.40 నుంచి రూ.180 వసూలు చేస్తున్నారు. ముంబయి ఇంట్రాసిటీ లాజిస్టిక్ మార్కెట్లో 20 శాతం వాటాను కలిగి ఉన్నారు. -
కేసులో మేటర్ లేదు..చేతులెత్తేసిన చంద్రబాబు లాయర్
-
ఆధునిక అభ్యుదయ కవి తిలక్
తణుకు టౌన్: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయ, భావ కవిత్వం వైపు నడిపించిన గొప్ప కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సాహిత్య అకాడమీ, తిలక్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన దేవరకొండ బాల గంగాధర్ తిలక్ శత జయంతిని పురస్కరించుకుని సాహితీ సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సుకు సాహితీ అకాడమీ, తెలుగు అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తిలక్ తన రచనల్లో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, జాతి, మత తత్వాలకతీతంగా ఆయన రచనలున్నాయని కొనియాడారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ తిలక్ కవిత్వం 20వ శతాబ్దపు సాహిత్య ప్రపంచంలో ఎక్కువ జనాదరణ పొందిందన్నారు. తెలుగు సాహిత్యంలో శ్రీ శ్రీ తర్వాత అంతటి ప్రభావం చూపిన రచనలు తిలక్‌వని కొనియాడారు. నా కవిత్వంలో నేను దొరుకుతాను అని ప్రకటించుకున్న కవి తిలక్ అని, ఆయన కవిత్వానికి మధ్యవర్తులు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో తిలక్ రచనలపై ముద్రించిన పుస్తకాలను చిన వీరభద్రుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తణుకు నన్నయ భట్టారక పీఠం అధ్యక్షుడు జేఎస్ సుబ్రహ్మణ్యం, పలువురు కవులు తదితరులు పాల్గొన్నారు. -
తొలి పార్లమెంటేరియన్ తిలక్ కన్నుమూత
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, మొదటి పార్లమెం టేరియన్ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ (98) శుక్రవారం అక్కయ్య పాలెంలోని తన కుమారుడి ఇంట మధ్యాహ్నం 12.48 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయ నకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య సూర్యకాంతం 2015లో కన్ను మూశారు. అప్పటి నుంచి కుమారుడు వద్ద ఉంటున్నారు. ఈయన విద్యాభ్యాసం మహారాజా కాలేజీ, బెనారస్ కళాశాల, బెల్గాంలలో సాగింది. గ్రాడ్యు యేషన్ పూర్తిచేసి, న్యాయవిద్యలో పట్టభద్రు లయ్యారు. తొలి పార్లమెంట్ ఏర్పడిన 1952 నుంచి 1957 వరకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తిలక్ ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ఈయన దేశంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన వారిగా గుర్తింపు పొందారు. మొదట్లో కాంగ్రెస్ ద్వారా రాజకీ యాల్లో ప్రవేశించినా తదనంతరం సోషలిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై సోషలిస్టు పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. పార్ల మెంట్‌కు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో నాటి ప్ర«ధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. ఇంతవరకు జీవించి ఉన్న తొలి పార్లమెంటే రియన్ ఈయన ఒక్కరే. కాగా, తిలక్ పార్థివ దేహాన్ని ఆయన కోరిక మేరకు గాయత్రి వైద్య కళాశాలకు అందజేయనున్నట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. తిలక్ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. -
మహాత్మా గాంధీ,తిలక్ లు లౌకిక వాదానికి వ్యతిరేకులు
ముంబై: ఇటీవల రాజస్థాన్ లోని పాఠ్యపుస్తకాల్లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కు సంబంధించిన వివాదం ఇంకా మరచిపోకముందే మరో వివాదం మొదలైంది. ముంబై యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లర్నింగ్ బుక్స్ లో ఉన్న అంశాలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. నెహ్రూకు సంబంధించిన విషయాలను వదిలేశారు. మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ లను లౌకిక వాదానికి వ్యతిరేకమని పాఠ్య పుస్తకాల్లో ఉంది. యూనివర్సిటీకి చెందిన సివిక్స్, పాలిటిక్స్ డిపార్ట్ మెంట్ ఈ బుక్కును సంకలనం చేసింది. ఇటీవల రాజస్థాన్ లోని ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకాల్లో జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉండంటం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాషాయీకరనలోభాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించింది. -
ఆ ఇద్దరు!
ఆ ప్రేమికుల గురించి చెప్పగానే... సినిమా కథ గుర్తు రావచ్చు. ‘‘నిజజీవితంలో ఇలాంటి వారు కూడా ఉంటారా?’’ అని అనుమానం కూడా రావచ్చు. అణుమాత్రం సందేహం లేదు. ఇది నిజమైన కథ. నిజాయితీ నిండిన తిలక్, ధనల ప్రేమ, పెళ్లి కథ. *********** వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ‘నువ్వు లేకపోతే నేను బతకలేను’లాంటి భారీ డైలాగులేవీ చెప్పుకోలేదు. ‘పేద వాళ్ల కోసం బతకాలి’ అనుకున్నారు. చెన్నైకి చెందిన తిలక్, ధనలకు మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం. ఈ క్రమంలోనే వారి మధ్య పరిచయం పెరిగింది. స్నేహంగా మారింది. ధన పెళ్లిచేసుకోవాలనుకోలేదు. కారణం...సామాజిక సేవ, వన్యప్రాణి సంరక్షణ అంటే ఆమెకు ఇష్టం. వాటికి సంబంధించిన పనుల్లో చురుగ్గా పాల్గొవాలనేది ఆమె ఆలోచన. తిలక్‌కు పెళ్లి ఆలోచన ఎప్పుడూ లేదు. కారణం....ఆధ్యాత్మిక, సామాజిక కార్యకలాపాలలోనూ, ట్రెక్కింగ్ లాంటి సాహసిక పనుల్లో కాలం గడపాలని ఆయన ఆలోచన. దేవుడు...ఈ ఇద్దరినీ చూసి నవ్వి ఉంటాడు. మంచి ఆలోచనలు ఉన్న ఈ ఇద్దరికీ పెళ్లి చేస్తే లోకానికి మేలు జరుగుతుందని కూడా అనుకొని ఉంటాడు! *********** ‘సేవై కరంగళ్’ పేరుతో పిల్లల సంక్షేమానికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలను చెన్నైలో నిర్వహించేవాడు తిలక్. ‘సేవై కరంగళ్’ సంస్థ పనితీరు కూడా భిన్నంగా ఉండేది. ఎంతో కొంత సహాయం చేసి చేతులు దులుపుకోవడం కాకుండా పిల్లల చదువులు, ఆరోగ్యం...ఇలా అన్ని విషయాలలో పిల్లలతో మమేకమయ్యేది. అలాగే ‘చెన్నై ట్రెక్కింగ్ క్లబ్’ ద్వారా ఒక సహకారం కూడా తీసుకుంది సంస్థ. ‘చెన్నై ట్రెక్కింగ్ క్లబ్’ తరపున ఎంతో మంది ‘చిల్డ్రన్స్ హోం’లలో తమ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొని పిల్లలకు కానుకలు, వారి సంక్షేమానికి విరాళాలు ఇచ్చేవారు. తమతో పాటు పిల్లలను ట్రెక్కింగ్‌కు తీసుకువెళ్లేవాళ్లు. వాళ్లలో సంతోషం నింపేవాళ్లు. ‘‘పిల్లలకు కావాల్సింది తిండి, బట్ట మాత్రమే కాదు. ప్రేమ, ఆత్మీయతలు కూడా’’ అని చెప్పే తిలక్ ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎక్కడైనా ‘చిల్డ్రన్స్ హోమ్’లు పిల్లలతో కిక్కిరిసి ఉన్నాయంటే, మరిన్ని గదుల నిర్మాణం కోసం నిధులు సేకరించి కొత్త గదులు కట్టించేవాడు. సేవాకార్యక్రమాలే కాకుండా పిల్లల్లో సృజనాత్మకతను తీర్చిదిద్దడానికి ‘నేవిగేటర్’ పేరుతో ఒక సంస్థను కూడా నిర్వహించాడు. ఎక్కడ... ఏ చిల్డ్రన్ హోంలో మౌలిక వసతులు సరిగా లేకపోయినా రంగంలోకి దిగి యుద్ధప్రాతిపాదికన రంగంలోకి దిగేవాడు. నాలుగు సంవత్సరాల కాలంలో చైల్డ్‌హోమ్, వృద్ధాశ్రమాలకు తిలక్ అందించిన సహకారం గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితాయే అవుతుంది. తిలక్ వ్యక్తిగత విషయానికి వస్తే, అతనేమీ సంపన్న కుటుంబం నుంచి రాలేదు. పేద కుటుంబం నుంచే వచ్చాడు. అతని హృదయం మాత్రం సంపన్నమైంది. ధన కూడా అంతే. *********** పెళ్లే వద్దనుకున్న ధన కాస్తా తిలక్ విశిష్ట వ్యక్తిత్వాన్ని చూసి ముచ్చటపడింది. ఒకానొక రోజు ‘‘మనం పెళ్లి చేసుకుందాం’’ అని ప్రతిపాదన పెట్టింది. ‘‘వద్దు’’ అనదగిన కారణం ఒక్కటీ అతనికి కనిపించలేదు. ఆమె ఆసక్తులు, అభిరుచులు కూడా తన లాంటివే! ‘‘తప్పకుండా’’ అన్నాడు సంతోషంగా. కానీ రెండు వైపులా కుటుంబ పెద్దలను ఒప్పించడానికి రెండు సంవత్సరాలు ఓపిక పట్టారు. ఈమధ్య కాలంలో ప్రేమికులుగా మాత్రమే ఉండిపోయారు. పెద్దలకు తమ భావాలను అర్థం చేయించే ప్రయత్నం చేయించారు తప్ప ‘ఈ పెద్దలు ఉన్నారే..’ అని అనుకోలేదు. ఓపికతో ఎదురుచూశారు. ఎట్టకేలకు పెద్దలు ఒప్పుకున్నారు. సాధారణంగా మనం చూసే ‘పెళ్లిళ్ళ’తో పోలిస్తే ఆ పెళ్లికి ఎక్కడా పోలిక, పొంతన లేదు. నిరాడంబరంగా జరిగింది. విశేషం ఏమిటంటే ఈ పెళ్లివేడుక పేద పిల్లల చదువులకు ఉద్దేశించిన నిధుల సమీకరణకు వేదిక అయింది. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన రీతిలో వారు విరాళాలు ఇచ్చారు. పెళ్లికి ముఖ్య అతిథులుగా...చెన్నైలోని ఎనిమిది ‘చిల్డ్రన్స్ హోమ్స్’ నుంచి పిల్లలు వచ్చారు. పెళ్లి పందిరిలో వధువు తన ఒడిలో కూర్చోబెట్టుకున్న ఆరు నెలల అమ్మాయి గురించి అందరూ ఆసక్తిగా ఆరా తీయడం ప్రారంభించారు. ఆ అమ్మాయి పేరు ‘థెరిసా’ హెచ్ఐవి సోకిన ఒక టీనేజ్ అమ్మాయికి పుట్టిన బిడ్డ. ‘థెరిసా’ను పెళ్లికి ముందే దత్తత తీసుకున్నారు ధన, తిలక్‌లు. ‘‘చాలా కాలం తరువాత నా మనసుకు నచ్చిన పెళ్లికి వచ్చాను. మన దేశంలో ఎందరికో స్ఫూర్తినిచ్చే పెళ్లి ఇది’’ అన్నాడు పెళ్లికి వచ్చిన ఒక అతిథి. ఇది ఆయన అభిప్రాయం మాత్రమే కాదు...పెళ్లికి వచ్చిన అందరి అభిప్రాయం. *********** తిలక్, ధనలు కలిసికట్టుగా సేవాకార్యక్రమాలు చేస్తున్నారనేది ఒక కోణం అయితే, చాలామంది యువకులకు వీరి పెళ్లి స్ఫూర్తిగా నిలిచింది. సేవాస్పృహ ఉన్న యువకులు తిలక్-ధనల తరహాలోనే వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. తిలక్, ధనలు కలిసి ఏడడుగులు మాత్రమే వేయలేదు. చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక కొత్త అడుగు కూడా వేశారు! -
తిలక్, స్వాతిలకు టైటిల్స్
బెంగళూరు: వరల్డ్ 10కే బెంగళూరు రన్లో భారత్ నుంచి పురుషుల, మహిళల విభాగాల్లో బి.సి.తిలక్, స్వాతి విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఈ రేస్‌లో 10 కిలోమీటర్ల దూరాన్ని తిలక్ 30 నిమిషాల 26 సెకన్లలో... స్వాతి 37 నిమిషాల 22 సెకన్లలో అధిగమించారు. అనీష్ థాపా (30ని:38 సె), నితేంద్ర సింగ్ రావత్ (30ని:47సె) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. మహిళల విభాగంలో జయశ్రీ (37ని:35సె), సుప్రియా పాటిల్ (37ని:46సె) రెండు, మూడు స్థానాలను పొందారు. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో జెఫ్రీ కమ్వోరర్ (కెన్యా-27ని:44 సెకన్లు)... మహిళల విభాగంలో లూసీ కబూ (కెన్యా-31ని:48 సెకన్లు) టైటిల్స్ సాధించారు. -
మంచి కోసం మనువాడారు!
ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, చుట్టూ వందలాది మంది అతిథులు, నగల ధగధగలు, అలంకరణల మిలమిలలు... ఇవి లేకుండా పెళ్లి చేసుకోడానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ ఆ ఇద్దరూ ఇవేమీ వద్దనుకున్నారు. అసలు తమ పెళ్లి తమ ఆనందం కోసం కాకుండా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అనుకున్నారు. ఇందుకే ఈ రోజున అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, తనని ఎంత బాగా చూసుకుంటారు అని అంచనా వేసుకున్న తరువాతే ఎవరైనా పెళ్లికి సిద్ధపడతారు. కానీ చెన్నైకి చెందిన తిలక్, ధన ఇవేమీ చూసుకోలేదు. ఎంత మంచివారు, ఎంత సేవ చేస్తారు, ఇతరుల కోసం జీవితాన్ని ఎంతవరకూ అంకితమివ్వగలరు అని చూసుకున్నారు. తిలక్ తన స్నేహితుడు నందన్‌తో కలిసి ఓ సేవాసంస్థను నడుపుతున్నాడు. గ్రామాల్లోని పేద పిల్లలను చదివిస్తుంటాడు. ఓ కార్యక్రమంలో అతడికి పరిచయమయ్యింది ధన. అతడు చేస్తోన్న సేవ గురించి తెలిసి ముగ్ధురాలయ్యింది. ఆమెలో ఉన్న సేవాగుణం అతడినీ ఆకర్షించింది. కొన్ని మంచి పనుల కోసం ఇద్దరూ కలిసి అడుగులు వేయాలనుకున్నారు. తరువాత ఆ ఆశయం వారితో ఏడడుగులు వేయించింది. ఓసారి ఎయిడ్సతో బాధపడుతోన్న ఓ చిన్నారిని చూసింది ధన. ఆ బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమను ఇవ్వాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని తిలక్‌ని అడిగింది. అంతలోనే మరో మనసున్న దంపతులు ఆ పాపని దత్తత చేసుకున్నారు. అయితే ఇద్దరూ కలిస్తే కొందరికి జీవితాన్ని ఇవ్వొచ్చు అన్న ఆలోచన బలపడింది. సేవ చేయడం కోసం ఇద్దరూ ఒకటవ్వాలనుకున్నారు. చివరకు తమ పెళ్లి కూడా పేదపిల్లలకే ఉపయోగపడేలా చేయాలనుకున్నారు. అందుకే తమ పెళ్లికి వచ్చేవారిని బహుమతులు తీసుకురావొద్దని, ఏదిచ్చినా ధన రూపంలోనే ఇవ్వాలని ముందే చెప్పారు. అతిథులతో పాటు పేదపిల్లలను కూడా పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లిరోజున వాళ్లిద్దరూ పట్టుబట్టలు కట్టుకోలేదు. పందిళ్లు వేయలేదు. అలంకరణలు లేవు. అతి సింపుల్‌గా మనువాడారు. వచ్చిన కానుకల్ని, తమ పెళ్లికి ఖర్చు చేయాలని ఇంట్లోవాళ్లు దాచిన మొత్తాన్నీ కూడా పేదపిల్లల సంక్షేమానికి వినియోగించారు. నాటినుంచి నేటివరకూ... అంటే దాదాపు రెండేళ్లుగా వారు చిన్నారుల జీవితాలను తీర్చిదిద్దేందుకే పాటు పడుతున్నారు. ఆదర్శ దంపతులుగానే కాదు... ఆదర్శనీయమైన వ్యక్తులుగానూ అభినందనలు అందుకుంటున్నారు! -
అమృతం కురిపించిన కవి
‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు... నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు... నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’... అన్న తిలక్ అన్యులకు సాధ్యంకాని పథంలో నడచిన భావకవి. అభ్యుదయ కవి. అభ్యుదయ భావకవి. ఆయన ్ఛకలం కృష్ణశాస్త్రి. ఆయన గళం శ్రీశ్రీ. కవిత్వం రాసినా, కథలు రాసినా, నాటకాలు రాసినా తిలక్ ముద్ర తిలక్‌దే. అదో నవనీతం. అదే హాలాహలం. ఆయన కవిత్వం ‘అమృతం కురిసిన రాత్రి’ తెలుగు పాఠక హృదయాలు ఎండకు వడలినప్పుడల్లా అమృతాన్ని కురిపిస్తూనే ఉంది. ఆయన కథలు ‘నల్లజర్ల రోడ్డు’, ‘ఊరి చివర ఇల్లు’, ‘సుందరి - సుబ్బారావు’, ‘అతని కోరిక’ వంటివి తెలుగు కథామాగాణంలో తళుకుబెళుకుల రాళ్ల వలేగాక నిక్కమైన నీలాలుగా మెరుస్తూ ఆ దారిన వచ్చే కొత్త బాటసారులకు మార్గం చూపుతున్నాయి. ఆయన లేఖలు, వ్యాసాలు... అన్నీ తెలుగు సారస్వతానికి ఖజానా. పెన్నిధి. తిలక్ సాహిత్యం విడివిడిగా అందుబాటులో ఉన్నా మొత్తం లభ్య రచనలను మనసు ఫౌండేషన్వారు ఎమెస్కోతో కలిసి ‘దేవరకొండ బాల గంగాధర తిలక్’ పేరుతో బృహత్ సంపుటిగా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సందర్భంగా వెలువరించారు. దాదాపు వెయ్యి పేజీల ఈ పుస్తకంలో పద్యకవిత్వం, వచన కవిత్వం, కథ... ఇలా అన్ని ప్రక్రియల్లో తిలక్ రచనలు ఉన్నాయి. ఆయన తేజస్సును పట్టి చూపుతున్నాయి. ఈ పుస్తకానికి తిలక్ అభిమాన శిష్యులు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు ప్రత్యేకంగా రాసిన విస్తృత ముందుమాటలోని కొన్ని విశేషాలు.... తిలక్‌గారి దృష్టిలో ‘విశ్వనాథ.. కృష్ణశాస్త్రి.. శ్రీశ్రీ’ ఆధునికాంధ్ర కవిత్వానికి త్రిమూర్తులు. అయితే మరికొందరి దృష్టిలో ‘శ్రీశ్రీ.. తిలక్.. శేషేంద్ర’ నవ్యాధునిక కవిత్వానికి త్రిమూర్తులు. తిలక్ గారిదీ నాదీ ఒకే ఊరు. తణుకు. 1955లో భారతిలో ఆయన కవిత ‘ఆర్తగీతం’ ప్రచురితమైనప్పుడు ఆయనను పరిచయం చేసుకొని పై చదువులకు వెళ్లేవరకు ఐదేళ్లపాటు అంటి పెట్టుకొని శిష్యరికం చేశాను. తిలక్‌గారి స్వస్థలం తణుకు తాలూకా మండపాక. వీరిది గొప్ప ధనిక కుటుంబం. వీరి తాత తండ్రులు మండపాక జమీందారులుగా ప్రసిద్ధి. వీరు వెలనాటి వైదిక బ్రాహ్మణులు. తిలక్‌గారు మొత్తం పన్నెండు మంది సంతానంలో ఆరవవారు. ఆయన భార్య పేరు ఇందిరాదేవి. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. అందరూ విదేశాల్లో స్థిరపడ్డారు. తిలక్‌గారు గొప్ప ధనిక కుటుంబంలో పుట్టినా జీవితంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుండే వారు. గుండె జబ్బుకు పెద్ద ఖర్చుతో వైద్యం చేయించుకోవడం వల్ల, ఉద్యోగలేమి వల్ల, స్టెయిన్ లెస్ స్టీల్ వ్యాపారం చేసి నష్టపోవడం వల్ల తిలక్‌గారు ఆర్థికంగా చితికిపోయి ఉంటారని నా ఊహ. తిలక్‌గారు ఇంటర్‌తో చదువు ఆపేశారు. సొంతగా తెలుగు, సంస్కృత, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. ఆయనకు చాలా మంది మిత్రులు ఉండేవారు. మల్లవరపు విశ్వేశ్వరరావు, పాలగుమ్మి పద్మరాజు, పిలకా గణపతి శాస్త్రి, అనిసెట్టి సుబ్బారావు, అబ్బూరి వరద రాజేశ్వరరావు... ఇలా. రెండవ తరంలో ఆవంత్స, వరవరరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ తదితరులు. తిలక్‌గారు వీరందరితో కలిసి సాహితీ చర్చలు చేస్తుండే వారు. తిలక్‌గారి జీవితకాలమే తక్కువ (1921 - 66) అనుకుంటే దురదృష్టం అందులో ఆయనకు అనారోగ్య విరామ దశ (1946 - 54) ఉండటం. నరాల జబ్బు అన్నారు. కాని తిలక్‌గారికి ఏ జబ్బూ లేదనీ ఆయన హైపో కాండ్రియాసిస్ (లేని జబ్బును ఊహించుకోవడం)తో బాధ పడుతున్నారని డాక్టర్ల అభిప్రాయం. కాని నిజంగానే ఆయన ఏదో వ్యాధితో బాధ పడేవారు. ఏమైనా ఆయన ఉజ్వలంగా రాయాల్సిన 25వ ఏట నుంచి 33వ ఏట వరకు ‘గదిలో మంచమే ఎల్లలోకమనుచు’ ఉండిపోయారు. తిలక్ వచన కవితలన్నీ పుస్తకంగా ఆయన బతికి ఉండగా రాలేదు. 1966లో ఆయన మరణించారు. 1968 జూలైలో విశాలాంధ్ర వారు వాటిని ప్రచురించారు. దీనికి కుందుర్తి చేత పీఠిక రాయించారు. ఈ కావ్యానికి ‘అమృతం కురిసిన రాత్రి’ అనే శీర్షిక కూడా కుందుర్తిగారే పెట్టారు. ఈ కవితలలోనే ‘మైల పడిన దుప్పటిలా నాగరికత నన్ను కప్పుకుంది’/ ‘రాత్రిని రంపం పెట్టి కోసినప్పుడు రాలిన పొట్టులా ఉంది వేకువ’ లాంటి కొత్త అలంకారాలను ప్రవేశపెట్టారాయన. ‘అమృతం కురిసిన రాత్రి’కి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చాయి. ఈ సంపుటిలోనే ఒక కవితలో ‘కార్తిక మాసపు రాత్రి వేళ/ చల్లని తెల్లని వెన్నెల’ ఎలా ఉన్నదో చెపుతూ తిలక్ ఇలా అంటారు: ‘ఎంత శాంతంగా, హాయిగా, ఆప్యాయంగా ఉందీ! చచ్చిపోయిన మా అమ్మ తిరిగొచ్చినట్టుంది’ నేను కొంతకాలం తణుకు పోస్టాఫీసులో గుమాస్తాగా పని చేశాను. ప.గో.జిల్లా తంతి తపాలా శాఖవారు జరుపుకొనే వార్షికో త్సవాల సందర్భంగా పోస్ట్‌మేన్ మీద ఒక గేయం రాయమని వెంటపడ్డాను. చూద్దాం చూద్దాం అంటూనే రాయలేదు. ఉత్సవాలు అయిపోయాయి. తీరా ఒకరోజు పిలిచి ‘పోస్ట్‌మేన్’ కవిత వినిపించారు. అద్భుతం. కాని అప్పుడే రాసి ఉంటే బాగుండేది కదా అని నేను నిష్టూర పడితే ‘నువ్వడిగినప్పుడు రాసుంటే ఏడ్చినట్టు వచ్చేది. ఇంత కాలం నానింది కాబట్టే బాగా వచ్చింది’ అన్నారు. ‘మై డియర్ సుబ్బారావ్! కనిపించడం మానేశావ్’ అని మొదలయ్యే ఆ కవిత నన్ను సంబోధిస్తూ నా జీవితాన్ని ధన్యం చేసింది. తిలక్‌గారు రాయాలని రాయలేక పోయిన నాటకం- ఖడ్గతిక్కన. ‘చూడు సుబ్బారావ్. ఖడ్గతిక్కనను శత్రువులు చంపలేదు. నెల్లూరి ప్రజలు, తల్లిదండ్రులు, భార్య కలిసి చంపేశారు. ప్రతికూల పరిస్థితులు న్నప్పుడు యుద్ధం నుంచి పారిపోయి వస్తే తప్పేముంది? బెర్నాడ్ షా ‘ఆర్మ్స్ అండ్ ది మేన్’ నాటకం రాసినట్టుగా నేను ఖడ్గ తిక్కన నాటకాన్ని కొత్తగా రాస్తాను’ అనేవారు. తిలక్‌గారు కథకులుగా ప్రసిద్ధులు. సమకాలీన సంఘటనలకు ఆయన వెంటనే స్పందించేవారు. నవకాళి దురంతాలు జరిగిన కొద్దిరోజులకే ‘అద్దంలో జిన్నా’ రాశారు. ‘ఊరి చివరి ఇల్లు’ కథను ‘ది షాడోస్’ పేరుతో స్వయంగా ఆంగ్లంలోకి అనువదించి ‘ట్రిబ్యూన్’ అమెరికన్ పత్రిక జరిపే ప్రపంచ కథల పోటీకి పంపారు. ఈ పత్రిక జరిపిన పోటీలలోనే గతంలో పాలగుమ్మిగారి ‘గాలివాన’ కథకు బహుమతి వచ్చింది. ఆయనకు మల్లే తనకు కూడా బహుమతి రావాలనే పట్టుదల తిలక్గారిలో ఉండేది. తిలక్ కవిత్వాన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ‘అద్భుత సౌందర్యం - దుర్భర విషాదం’. శ్రీశ్రీ చెప్పినట్టుగా ‘కవితాసతి నొసట నిత్య రసగంగాధర తిలకం’ స్వర్గీయ దేవరకొండ బాలగంగాధర తిలక్.