‘సూర్య తిలక్‌’ వేడుక.. ట్యాబ్‌లో వీక్షించిన ప్రధాని | PM Modi Watched 'Surya Tilak' Ritual Of Ayodhya Ram Lalla In Assam | Sakshi
Sakshi News home page

‘సూర్య తిలక్‌’ వేడుక.. ట్యాబ్‌లో వీక్షించిన ప్రధాని మోదీ

Published Wed, Apr 17 2024 3:30 PM | Last Updated on Wed, Apr 17 2024 3:44 PM

Pm Watched Surya Tilak Ritual Of Ayodhya Ram In Assam - Sakshi

గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్‌’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని సభలోని వారందరినీ సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ ఆన్‌ చేసి కాసేపట్లో జరిగే సూర్యతిలక్‌ ఉత్సవానికి సంఘీభావం తెలపాలని కోరారు.

సెల్‌ఫోన్‌లైట్‌ కిరణాలు కూడా పంపాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘దేశ వాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరింది. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది తొలి రామ్‌ నవమి. కాసేపట్లో సూర్యతిలక్‌ వేడుక జరగనుంది.

మీరందరూ మీ సెల్‌ఫోన్‌ లైట్‌లను వెలిగించండి.. జై శ్రీరామ్‌, జై శ్రీరామ్‌ నినాదాలివ్వండి’అని ప్రధాని కోరారు. ర్యాలీ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న ట్యాబ్‌లో సూర్యతిలక్‌ వేడకను వీక్షించారు. ఈ దృశ్యాలను ఆయన తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో పోస్టు చేశారు. 

ఇదీ చదవండి..బాలరాముడికి సూర్య తిలకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement