ఐశ్వర్యరాయ్‌పై రాహుల్‌ కామెంట్స్‌.. సిద్దరామయ్యకు బీజేపీ కౌంటర్‌ | Karnataka BJP Serious Over Rahul Gandhi Slurs Against Aishwarya Rai | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యరాయ్‌పై రాహుల్‌ కామెంట్స్‌.. సిద్దరామయ్యకు బీజేపీ కౌంటర్‌

Published Thu, Feb 22 2024 9:12 AM | Last Updated on Thu, Feb 22 2024 9:47 AM

Karnataka BJP Serious Over Rahul Gandhi Slurs Against Aishwarya Rai - Sakshi

ఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, సినీ నటి ఐశ్వర్యరాయ్‌పై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ తీరుపై బీజేపీ నేతలు, ప్రముఖ సింగర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాహుల్‌కు కౌంటర్‌ కూడా ఇచ్చారు. 

కాగా, భారత్‌ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్‌.. దేశాన్ని నడిపించే వ్యక్తులను అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉంచారని విమర్శలు చేశారు. అదే సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్‌లను అయోధ్యకు ఆహ్వానించారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే మీరు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూశారా. అందులో ఒక్కరైనా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖాలను చూశారా. కానీ ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కానీ దేశాన్ని నిజంగా నడిపించే వ్యక్తులను మనం అంత గొప్ప కార్యక్రమంలో చూడలేదు. వాళ్లు దేశాన్ని ఎప్పటికీ నియంత్రించలేరని గుర్తుంచుకోవాలి. కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని తేల్చి చెప్పారు. పారిశ్రామికవేత్తలు, అమితాబచ్చన్‌ను ఆహ్వానించడం ద్వారా జనాభాలో మిగతా 73 శాతం మందికి ప్రాముఖ్యత లేదని చెప్పినట్టేనని మండిపడ్డారు. దీంతో, రాహుల్‌ కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి. 

ఇక, రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ, సింగర్‌ సోనా మహాపాత్ర స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ కామెంట్స్‌పై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ.. దేశంలో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించకపోవడంతో రాహుల్‌ మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో రాహుల్‌కే తెలియడం లేదు. రాహుల్ కన్నడిగులను అవమానించారని మండిపడింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్దరామయ్య.. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తారా? అని ప్రశ్నించింది. సాటి కన్నడ వ్యక్తి(ఐశ్వర్యరాయ్‌)ని రాహుల్ అవమానిస్తుంటే సీఎం సిద్దరామయ్యా చూస్తూ ఎలా ఊరుకుంటారని మండిపడింది. మహిళలను కూడా కించపరిచే స్థాయికి తిరగజారాడంటూ వ్యాఖ్యలు చేసింది. 

మరోవైపు.. రాహుల్‌ వ్యాఖ్యలపై సింగర్‌ సోనా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాజకీయ నాయకులు(రాహుల్‌ గాంధీ) తమ స్వలాభం కోసం ప్రసంగాల్లో మహిళలను కించపరచడం ఏంటి? అని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement