భారత ప్రజాస్వామ్యం గురించి లండన్‌లో ప్రశ్నలా? రాహుల్‌కు మోదీ చురకలు | Unfortunate That Questions Raised About India Democracy Uk Pm Modi | Sakshi
Sakshi News home page

భారత ప్రజాస్వామ్యం గురించి లండన్‌లో ప్రశ్నలా? రాహుల్‌కు మోదీ చురకలు

Published Sun, Mar 12 2023 7:10 PM | Last Updated on Sun, Mar 12 2023 9:29 PM

Unfortunate That Questions Raised About India Democracy In Uk Pm Modi Jibe At Rahul - Sakshi

బెంగళూరు: భారత ప్రజాస్వామ్వం గురించి కొందరు లండన్‌లో ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరమని ‍వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. కర్ణాటక హుబ్బళ్లి- ధార్వాడ్‌లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసన అనంతరం ర్యాలీలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. భారత ప్రజాస్వామ్యం గురించి కొందరు లండన్‌లో ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరం. కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి తరచూ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో ఏ శక్తి భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు హాని తలపెట్టలేదు. కానీ కొందరు దాన్ని రేవులో నిలబెడుతున్నారు.' అని మోదీ ఫైర్ అయ్యారు.

కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫాంకు శంకుస్థాపన చేశారు. హుబ్బళ్లిలోని శ్రీ సిద్ధారుదలో 1.5కిలోమీటర్ల పొడవున్న ఈ ప్లాట్‌ఫాం అరుదైన గుర్తింపు పొందింది.

గతవారం లండన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత పార్లమెంటులో విపక్ష సభ్యుల మైకులు ఆఫ్ చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ రాహుల్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
చదవండి: విద్వేష ప్రసంగంపై ప్రశాంత్ కిశోర్‌ ట్వీట్‌.. ఎన్‌టీకే నేత సీమన్‌పై కేసు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement