Tab
-
‘సూర్య తిలక్’ వేడుక.. ట్యాబ్‌లో వీక్షించిన ప్రధాని
గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని సభలోని వారందరినీ సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ ఆన్ చేసి కాసేపట్లో జరిగే సూర్యతిలక్ ఉత్సవానికి సంఘీభావం తెలపాలని కోరారు. సెల్‌ఫోన్‌లైట్ కిరణాలు కూడా పంపాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘దేశ వాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరింది. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది తొలి రామ్ నవమి. కాసేపట్లో సూర్యతిలక్ వేడుక జరగనుంది. మీరందరూ మీ సెల్‌ఫోన్ లైట్లను వెలిగించండి.. జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలివ్వండి’అని ప్రధాని కోరారు. ర్యాలీ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న ట్యాబ్‌లో సూర్యతిలక్ వేడకను వీక్షించారు. ఈ దృశ్యాలను ఆయన తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు. #WATCH | PM Narendra Modi watched the Surya Tilak on Ram Lalla after his rally in Nalbari, Assam "Like crores of Indians, this is a very emotional moment for me. The grand Ram Navami in Ayodhya is historic. May this Surya Tilak bring energy to our lives and may it inspire our… pic.twitter.com/hA0aO2QbxF — ANI (@ANI) April 17, 2024 ఇదీ చదవండి..బాలరాముడికి సూర్య తిలకం -
ఏపీకి ప్రైమ్ మినిస్టర్ ఎక్స్‌లెన్స్ అవార్డు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న విద్యా బోదనకు గాను ‘ప్రైమ్ మినిస్టర్ ఎక్స్‌లెన్స్’ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక విద్యకు శ్రీకారం చుడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యా విప్లవానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. బ్లాక్ బోర్డు స్థానంలో తెచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌పీ), బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల ద్వారా ఆధునిక బోధనకు గాను రాష్ట్రాన్ని ఈ అవార్డు వరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమర్చిన ఐఎఫ్‌పీలు, 8, 9వ తరగతుల విద్యార్థుల చేతుల్లో ఉన్న ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన, సందేహాల నివృత్తికి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమం బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో అవార్డు ఎంపికలో కీలకపాత్ర వహించింది. దేశంలోనే అత్యుత్తమ విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా అత్యున్నత అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఇద్దరు అధికారులను రాష్ట్రానికి పంపింది. కేంద్ర డిప్యూటీ కార్యదర్శులు ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్‌తో కూడిన బృందం గురువారం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైసూ్కల్, గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పట్టాభిపురంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలను సందర్శించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీరికి పాఠశాలల్లో అమలు చేస్తున్న సాంకేతిక విద్యా బోధన గురించి వివరించారు. ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’పై ప్రశంసలు కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక బోధన పద్ధతులు, వసతులను తిలకించిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన అందించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్‌లు.. వారిలోని అద్భుతమైన మేధస్సు, సబ్జెక్టుల వారీగా పట్టు, ఇంగ్లిష్ భాష పరిజ్ఞానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ట్యాబ్‌ల ద్వారా ఇన్నోవేటివ్ ట్రెండ్స్, స్విఫ్ట్‌చాట్ యాప్, బైజూస్ కంటెంట్‌ను ఇంజినీరింగ్ విద్యార్థులు బోధిస్తున్న తీరును, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ తదితర సాంకేతిక నైపుణ్యాలపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పింస్తున్న తీరును పరిశీలించారు. ఐఎఫ్‌పీల ద్వారా ఉపాధ్యాయుల బోధనను ప్రత్యక్షంగా తిలకించారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ కార్యక్రమం ద్వారా ఏ ఏ అంశాలను నేర్చుకుంటున్నదీ విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. తరగతులను బోధిస్తున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతోనూ మాట్లాడారు. మూడు పాఠశాలల సందర్శన ముగించుకున్న అధికారుల బృందం.. సంబంధిత విద్యార్థులు చదువుతున్న కళ్లం హరనాథరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో చర్చించారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో పి.శైలజ, సీఎస్ఈ ఐటీ సెల్ ప్రతినిధి రమేష్, హెచ్ఎంలు ఉన్నారు. -
మారుతున్న కాలానుగుణంగా.. ఈ కొత్త టెక్నాలజీ మీకోసం..
'అతి వేగంగా పరుగెడుతున్న ఈ కాలాన్ని ఆపడం ఎవరి వలన కాదు. ఈ కాలంతోపాటుగా కొత్త టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతుంది. దానిని మనం గుప్పిట్లో దాచి, సరైన క్రమంలో.. టెక్నాలజీని ఉపయోగించుటకై సరికొత్త పరికరాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి వాటిని గురించి పూర్తిగా తెలుసుకందామా..!' మిల్క్ వే ట్యాబ్.. మన దేశ విద్యారంగంలోని కీలకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ సంస్థల సహాకారంతో ‘ఎపిక్’ ఫౌండేషన్ రూపొందించిన ట్యాబ్ మిల్క్ వే. కొన్ని వివరాలు: సైజ్: 8 అంగుళాలు రిజల్యూషన్: 1,280“800 పిక్సెల్స్ మీడియా టెక్ 8766 ఏప్రాసెసర్ 4జీబి ర్యామ్/64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5,100 ఎంఏహెచ్ హానర్ మ్యాజిక్ బుక్ 16ప్రో.. సైజ్: 16.00 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 165 హెచ్జడ్ రిజల్యూషన్: 3072“1920 పిక్సెల్స్ ఆపరేషన్ సిస్టమ్: విండోస్ 11 స్టోరేజ్: 16జీబి ప్లస్ 512జీబి సపోర్ట్: ఫింగర్‌ప్రింట్ సెన్సర్ బరువు: 1.75 కేజీ కలర్స్: వైట్ పర్పుల్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ‘ఫ్రెండ్ మ్యాప్’ అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది ఇన్స్టాగ్రామ్. ప్లాట్‌ఫామ్‌లోని యూజర్లకు తమ స్నేహితుల లోకేషన్‌ను చెక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. స్నాప్‌చాట్‌లోని ‘స్నాప్ మ్యాప్’ను పోలిన ఫీచర్ ఇది. తమ లొకేషన్‌ను ఎవరు చూడాలో ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది. ‘ఫ్రెండ్ మ్యాప్’లో యూజర్ తన చివరి యాక్టివ్ లొకేషన్‌ను దాచే ‘ఘోస్ట్ మోడ్’ కూడా ఉంటుంది. స్టిక్కీ నోట్స్.. మైక్రోసాఫ్ట్ వారి ‘స్టిక్కీ నోట్స్’ యాప్ కొత్త హంగులతో ముందుకు వచ్చింది. పాత ‘స్టిక్కీ నోట్స్’ను రీవ్యాంప్ చేసి ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకువచ్చారు. నోట్స్ క్రియేట్ చేయడానికి, స్క్రీన్ షాట్లను తీసుకోవడానికి, ఆడియోను రికార్డ్ చేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. ఇవి చదవండి: అసలు వీటి గురించి మీకు తెలుసా..! -
స్మార్ట్ ఫోన్లా ట్యాబ్‌లను వాడలేరు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు టెక్నాలజీ విద్యను చేరువ చేస్తూ ఉచితంగా అందించిన బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఐటీ సెల్ డిజిటల్ ఇనీషియేటివ్స్ రాష్ట్ర నోడల్ అధికారి సీహెచ్‌వీఎస్ రమేష్‌కుమార్ చెప్పారు. గురువారం గుంటూరులో ట్యాబ్‌ల యాక్టివేషన్‌పై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రమేష్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లను స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించేందుకు ఆస్కారం లేదని, ప్రీ లోడెడ్ యాప్స్‌ను గూగుల్ సంస్థ ద్వారా బ్లాక్ చేయించినట్లు తెలిపారు. బైజూస్ కంటెంట్‌తో కూడిన యాప్‌తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన స్విఫ్ట్‌చాట్, ఈ–పాఠశాల, డ్యూలింగో, డిక్షనరీ యాప్‌లు మినహా మరే ఇతర యాప్‌లు ట్యాబ్‌లు ఉండవని స్పష్టం చేశారు. ఇంటర్నెట్తో పనిలేకుండా బైజూస్ కంటెంట్‌ను విద్యార్థులు చూడవచ్చని.. మిగిలిన 4 యాప్స్‌ను చూడాలంటే పాఠశాలల్లోని వైఫై ద్వారా కనెక్ట్ కావాలని చెప్పారు. సిమ్‌కార్డ్ స్లాట్‌ను బ్లాక్ చేశామని, 256 జీవీ సామర్ధ్యం కలిగిన ఎస్డీ కార్డు ద్వారా 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్‌లో అన్ని పాఠ్యాంశాలను లోడ్ చేశామని తెలిపారు. డ్యూలింగో యాప్ ద్వారా విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకోవచ్చన్నారు. స్విఫ్ట్ చాట్ యాప్ ద్వారా విద్యార్థి ఏ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్నైనా తెలుసుకోవచ్చని.. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు.. ట్యాబ్‌లలో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా విద్యార్థుల ట్యాబ్‌లను ఐటీ సెల్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రమేష్‌కుమార్ చెప్పారు. ట్యాబ్‌లలో ఆధునిక భద్రతా వ్యవస్థ ఇమిడి ఉందన్నారు. ఈ ట్యాబ్‌లను విద్యార్థులు, ఉపాధ్యాయులు మినహా ఇతరులెవ్వరూ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు. బ్లాక్ చేసిన యాప్‌లను అన్‌లాక్ చేసేందుకు సెల్‌ఫోన్ షాపులవాళ్లు, ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం సమాచారం చేరవేసిందని తెలిపారు. విద్యార్థులు ట్యాబ్‌లలో ఏ సబ్జెక్టు ఎంతసేపు చూశారనే సమాచారం కూడా నమోదవుతుందని వివరించారు. సర్వీస్ సెంటర్ల ద్వారా ఉచిత సేవలు ట్యాబ్‌లలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే.. ఆ సంస్థ సర్వీసు సెంటర్ల ద్వారా ఉచిత సేవలు పొందవచ్చని రమేష్‌కుమార్ చెప్పారు. పని చేయని ట్యాబ్‌ను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు అందిస్తే, వాళ్లు ఆన్లైన్లో నమోదు చేసి టోకెన్ ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం ఆ ట్యాబ్‌ను సర్వీసు కేంద్రానికి పంపించి.. బాగు చేయించి మూడు రోజుల వ్యవధిలో తిరిగి అందజేస్తారని చెప్పారు. ట్యాబ్ కింద పడినా పాడవకుండా సురక్షితమైన కవర్ కేస్‌తో పాటు స్క్రీన్ గార్డు, చార్జర్, ఇయర్ ఫోన్ అందిస్తున్నట్లు చెప్పారు. -
విడుదలకు ముందే వన్‌ప్లస్ ట్యాబ్ ధరలు లీక్
టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో రోజు రోజుకి కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అలాంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 'వన్‌ప్లస్' (OnePlus) తన మొదటి ట్యాబ్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కొత్త ట్యాబ్ విడుదలకు ముందే ధరల వివరాలు లీక్ అయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వన్‌ప్లస్ ప్యాడ్ ట్యాబ్‌ను కంపెనీ గత ఫిబ్రవరిలోనే పరిచయం చేసింది. అయితే ఆ సమయంలో కంపెనీ ఈ ప్రొడక్ట్ లాంచ్, ప్రైస్ వంటి వాటిని వెల్లడించలేదు. కంపెనీ అధికారిక ధరలను వెల్లడించకముందే ఈ ట్యాబ్ రూ. 23,099 దరిదాపుల్లో ఉంటుందని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. లీకైన ధరలను బట్టి చూస్తే ఈ ట్యాబ్ సరసమైన ధర వద్ద లభించే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తుంన్నారు. విడుదల సమయంలో కంపెనీ దీని ధరలను వెల్లడిస్తుంది. (ఇదీ చదవండి: ఇప్పుడు పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!) త్వరలో విడుదలకానున్న వన్‌ప్లస్ ప్యాడ్ 11.61 ఇంచెస్ 2.8K ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ పొందుతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ వంటి వాటితో పాటు మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే, ఈ కొత్త ట్యాబ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి 9,510mAh బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం నాలుగు స్పీకర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ట్యాబ్ కోసం ఇప్పటికే అమెరికా, యూకేలలో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. ఇండియాలో ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. -
సచివాలయాల ద్వారా ట్యాబ్‌లకు రిపేర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందజేసిన ట్యాబ్‌లలో ఏదైనా సమస్య వస్తే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమా ణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 8వ తరగతి చదువుతున్న 5,18,750 మంది పిల్లలకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. అయితే వాటిలో ఏదైనా సమస్య వస్తే.. విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశముంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ట్యాబ్‌ల సర్వీసు అంశాల పర్యవేక్షణ కోసం సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యు కేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలను నోడల్ అధికారులుగా నియమించారు. అలాగే ట్యాబ్‌ల సర్వీస్ అంశాల పర్యవేక్షణకు గ్రామ, వార్డు సచి వాలయాల శాఖ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను కూడా రూపొందించింది. ట్యాబ్ రిపేర్ ప్రక్రియపై కలె క్టర్లు, సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్లతో పాటు అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏ సచివాలయంలోనైనా ట్యాబ్ సర్వీస్ పొందే వీలు.. ♦ సమస్య ఏర్పడిన ట్యాబ్‌ను విద్యార్థి గానీ తలిదండ్రులు లేదా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యాయులు ఎవరో ఒకరు తమకు సమీపంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏ సచివాలయంలోనైనా ఈ సేవను విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. ♦ ట్యాబ్ రిపేరు ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం ఫోన్ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. ట్యాబ్ సమస్య పరిష్కారమైన తర్వాత సంబంధిత సచివాలయ సిబ్బందే దానిని సేకరించి.. తిరిగి విద్యార్థికి అందజేస్తారు. ♦ ట్యాబ్ రిపేర్ చేయడానికి వీలుపడకపోతే ‘వారంటీ’ నిబంధనలకు లోబడి ఆ సర్వీసు సెంటర్ నుంచే కొత్త ట్యాబ్‌ను సంబంధిత సచివాలయ సిబ్బంది సేకరించి విద్యార్థికి అప్పగిస్తారు. కాగా, ఈ ప్రక్రియపై అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు 8 విడతలలో శిక్షణ ఇచ్చారు. -
ట్యాబులపైనా వంకర రాతలు.. ప్రభుత్వ ప్రయత్నాలను జీర్ణించుకోలేని ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద చిన్నారులకు ఇచ్చిన ట్యాబులపైనా ఈనాడు తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీర్ణించుకోలేక ఈనాడు తన దుష్ట నైజాన్ని ‘బడి ట్యాబుల్లో అన్నీ లభ్యం’ వార్త ద్వారా బయటపెట్టింది. రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థులకు అందించిన ప్రతి ట్యాబులోనూ సెక్యూరిటీ ప్యాచ్ వేశారు. అయితే, ఎక్కడో జరిగిన చిన్న ఘటనను పెద్దగా చూపిస్తూ ఈనాడు విషప్రచారం చేస్తోంది. ప్రభుత్వ ఉన్నత లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నానికి ఒడిగడుతోంది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ తీవ్రంగా ఖండించాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ కూడా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు.. ‘బడి ట్యాబుల్లో అన్నీ లభ్యం’ వార్తను ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతాశయంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, 8వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబులను పంపిణీ చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీపడాలని, వారు ఉన్నత శిఖరాలు చేరాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. అయితే, ఈ లక్ష్యాన్ని నీరుగార్చాలని ఎక్కడో జరిగిన చిన్నచిన్న విషయాలకు పత్రికాముఖంగా బురదజల్లే కార్యక్రమం జరుగుతోంది. నిజానికి.. ట్యాబుల విషయంలో ప్రభుత్వం ముందే అనేక రక్షణ చర్యలు తీసుకుంది. అవి ఏమిటంటే.. ♦ ప్రతీ ట్యాబ్‌లో సెక్యూరిటీ ప్యాచ్ వేయడం.. ♦ ప్రతీ ట్యాబ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంటు పర్యవేక్షణలో ఉంటుంది. ♦ ప్రతీ ట్యాబు విధిగా ఇంటర్నెట్కు ఒకసారి కనెక్ట్ చేయాలి. ♦ అలా చేయడంవల్ల ట్యాబుల్లో ఏమైనా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కాకపోతే అప్డేట్ అవుతుంది. ♦ ఎక్కడైనా ట్యాబులో ఏదైనా ఎర్రర్ వస్తే వార్డు వలంటీర్ ఆ ట్యాబు గురించి సంబంధిత శాఖ వారితో సంప్రదించి దానిని సరిచేసి రెండు పనిదినాల్లో విద్యార్థికి అందజేసే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకు సంబంధించి జీఓ–29 ద్వారా ఇలాంటి వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సమస్య ఉన్న ట్యాబులను గుర్తించి ఇప్పటికే సరిచేసి ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతోంది. ♦ కొన్ని సందర్భాల్లో ట్యాబులను మొబైల్ రిపేర్షాపులకు తీసుకెళ్లి బలవంతంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయిస్తున్నారు. అలాంటి ట్యాబుల వివరాలు, విద్యార్థి పేరు, మండలం, స్కూలుతో సహా ఇతర వివరాలు విద్యాశాఖకు వెంటనే తెలుస్తుంది. సదరు స్కూలు హెడ్మాస్టర్కు వెంటనే సమాచారం అందించి నెట్‌కు కనెక్ట్ చేయించి ట్యాబును లాక్ చేయిస్తున్నాం. ♦ ఇక 8వ తరగతి బోధించే ప్రతి ఉపాధ్యాయునికీ ట్యాబ్ ఉపయోగించే విధానం, చిన్నచిన్న ఎర్రర్లను ఏ విధంగా సరిచేసుకోవాలనే అంశాలపై పూర్తిస్థాయి శిక్షణను ప్రారంభిస్తున్నాం. ♦ ఇలా ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ట్యాబులు వినియోగించుకుని జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇలాంటి సత్సంకల్పాన్ని నీరుగార్చే ప్రయత్నాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ తీవ్రంగా ఖండిస్తోంది’. -
తక్కువ ధరలోనే ఐటెల్ 4జి ట్యాబ్ వచ్చేసింది.. వివరాలు
దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ఐటెల్ కంపెనీ తన మొదటి ట్యాబ్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ట్యాబ్ పేరు 'ఐటెల్ ప్యాడ్ వన్'. దీని ధర రూ.12,999. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ ట్యాబ్ త్వరలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఐటెల్ ప్యాడ్ వన్ తక్కువ ధరలకు లభించే లేటెస్ట్ ట్యాబ్. ఇది డీప్ గ్రే, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 4జీ కనెక్టివిటీ ఫీచర్ కలిగి, మెటల్ బాడీ పొందుతుంది. 10.1 ఇంచెస్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో ట్యాబ్ ఎడ్జ్‌లు ఫ్లాట్‌గా ఉండటం వల్ల మరింత అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఐటెల్ ప్యాడ్ వన్ ట్యాబ్‌లో యునీఎస్ఓసీ ఎస్సీ9863ఏ1 ప్రాససెర్ ఉంటుంది. మొమరీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. అంతే కాకుండా, ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ట్యాబ్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. కావున ఇది స్టాండర్డ్ 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో సింగిల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వైపై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అప్షన్ అవుతుంది. -
గాడ్జెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్, లెనోవో అద్బుతమైన 5జీ ట్యాబ్ వచ్చేసింది!
సాక్షి,ముంబై: గాడ్జెట్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో 11 అంగుళాల టచ్ స్క్రీన్‌తో తన తొలి ప్రీమియం 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. పీ 11 అనే 5జీ ట్యాబ్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ధర, లభ్యత 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది. లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్‌లో అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల నాన్‌స్టాప్‌గా వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. లెనోవో ట్యాబ్ పీ11 5జీ స్పెసిఫికేషన్స్ క్వాల్కమ్ స్నాప్‌డడ్రాగన్ 750జీ ఎస్ఓసీ ఆడ్రేనో 619 జీపీయూ 11 అంగుళాల 2కే ఐపీఎస్ టచ్‌స్క్రీన్ 7700ఎంఏహెచ్ బ్యాటరీ డివైజ్ స్లాట్ ద్వారా 5జీ సిమ్‌ని ఇన్సర్ట్ చేయడం ద్వారా 5G సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇంకా డస్ట్- వాటర్ రెసిస్టెన్స్ పీ11 5జీ ట్యాబ్‌లో 8ఎంపీ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12ఎంపీ రేర్ కెమెరా కూడా ఉంది. 4 జేబీఎల్ స్పీకర్లను జోడించింది. -
లెనోవో నుంచి సరికొత్త ట్యాబ్..! భారీ తగ్గింపుతో లాంచ్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లలోకి సరికొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ కె10మోడల్‌ను సోమవారం రోజున కంపెనీ విడుదల చేయగా...ఈ ట్యాబ్‌కు 7500ఎమ్ఎహెచ్ బ్యాటరీని అమర్చారు. 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లెనోవో లాంచ్ చేసిన ట్యాబ్ కే 10 ధర కంపెనీ వెబ్సైట్ లో రూ. 25000గా ఉండగా...ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో అతి తక్కువ ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది. 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999, కాగా 3జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 గా ఉంది. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 వోఎస్‌ను సపోర్ట్ చేయనుంది. అంతేకాకుండా రానున్న ఆండ్రాయిడ్ 12 వోఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చునని లెనోవో పేర్కొంది. చదవండి: జియో ఫోన్ సేల్స్ కోసం అదిరిపోయే బిజినెస్ మోడల్ లెనోవో ట్యాబ్ కే10 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ 10.3-అంగుళాల ఫుల్-హెచ్డీ (1,920x1,200 పిక్సెల్స్) టీడీడీఐ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 22టీ ప్రాసెసర్ లెనోవో యాక్టివ్ పెన్ సపోర్ట్ పవర్‌వీఆర్ జీఈ 8320 గ్రాఫిక్స్ ప్రసెసింగ్ యూనిట్ 4 జిబి ఎల్పిడిడిఆర్ 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 8ఎమ్పీ రియర్ కెమెరా 5ఎమ్పీ ఫ్రంట్ కెమెరా డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్పీకర్ USB టైప్-C పోర్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 7,500mAh బ్యాటరీ చదవండి: వారెవ్వా జియో..! అదిరిపోయే ఫీచర్లతో పాటు మరో సూపర్ అప్డేట్..! -
ట్యాబ్ ఇవ్వలేదని భవనం పైనుంచి దూకాడు
మియాపూర్: అన్నదమ్ముల మధ్య ట్యాబ్ వివాదం అందులో ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైంది. అన్నదమ్ములు ట్యాబ్ కోసం పోట్లాడుకోవడం చూసిన తండ్రి ట్యాబ్‌ను అన్నకు ఇవ్వడంతో తమ్ముడు మనస్తాపానికి గురై భవనం పైనుంచి దూకి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలను ఎస్ఐ లింగానాయక్ మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన శ్రీనివాస్, మల్లీశ్వరి దంపతులు మదీనాగూడలోని స్వప్న నిర్మాణ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నందకిశోర్, బాల వెంకట సత్యప్రసాద్ (12) ఇద్దరు కుమారులు. సత్యప్రసాద్ కొండాపూర్‌లోని మహర్షి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం అన్నదమ్ములిద్దరూ ఆడుకునే ట్యాబ్ కోసం గొడవపడ్డారు. ఇది చూసిన శ్రీనివాస్ ట్యాబ్‌ను నందకిశోర్‌కు ఇచ్చాడు. దీంతో సత్యప్రసాద్ మనస్తాపానికి గురయ్యాడు. శ్రీనివాస్ ఉద్యోగానికి వెళ్తుండగా సత్యప్రసాద్ వెళ్లవద్దని మారాం చేశాడు. కుమారుని మాటలు పట్టించుకోకుండా తండ్రి ఉద్యోగానికి వెళ్లాడు. దీంతో సత్యప్రసాద్ క్షణికావేశంలో ఐదు అంతస్తుల భవనం పెంట్‌హౌస్ నుంచి కిందికి దూకాడు. తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఇది చూసిన తల్లిదండ్రులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లాడి హోంవర్క్.. సామ్సంగ్ బంపరాఫర్
పాఠశాలల్లో టీచర్లు ఇచ్చే హోంవర్కులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాఠశాలలో విద్యార్థులకు టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఓ పిల్లాడికి ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ హోంవర్క్ పూర్తి చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. అయితే ఐదో తరగతి చదువుతున్న గులిహర్మే అనే పదేళ్ల పిల్లవాడి ఇంట్లో ఇంటర్నెట్ లేకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. హోంవర్క్ చేయకపోతే టీచర్ ఊరుకోదు.. అలా అని హోంవర్క్ చేయడానికి ఇంటర్నెట్ లేదు. దీంతో వెంటనే దగ్గర్లోని సామ్సంగ్ స్టోర్‌కు వెళ్లాడు. అతని అవసరాన్ని గుర్తించిన సామ్సంగ్ సిబ్బంది ఓ ట్యాబ్లొ ఇంటర్నెట్ ఆన్ చేసి ఇచ్చారు. దీంతో ఆ బాలుడు అక్కడే భుజానికి స్కూల్ బ్యాగుతోనే నోట్స్ రాసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 12 మిలియన్ల మందికి పైగా వీక్షించగా 4లక్షలకు పైగా లైకులు వచ్చిపడ్డాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ‘హోంవర్క్ చేయమని చెప్తే సరిపోతుందా? పిల్లల దగ్గర అందుకవసరమైన కంప్యూటర్లు లేనప్పుడు పాఠశాలలో ఉండే కంప్యూటర్లు వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలి, అందుకోసం వారికి కాస్త సమయం కేటాయించాల’ని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరోవైపు పిల్లవాడి క్లాస్‌వర్క్ పూర్తి చేయడానికి సహకరించిన సామ్సంగ్ సిబ్బందికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ పిల్లవాడి అవసరాన్ని గుర్తించిన సామ్సంగ్ నిర్వాహకులు అతనికి మూడు ట్యాబ్‌లు బహుమతిగా అందజేశారు. -
రైల్వే శాఖ తొలి వినూత్న ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీః రైలు ప్రయాణీకుల సౌకర్యార్ధం, రైల్వే శాఖ ఒక వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కాఫీ, టీ తదితర వాటికోసం పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే శాఖ ట్విటర్లో ఒక వీడియోను షేర్ చేసింది. ట్యాబ్లెట్ ఆధారంగా ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లు ప్రయాణికులకు సేవలను అందించనున్నాయని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. తద్వారా రైలు ప్రయాణికులు తమకు అవసరమైన బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటి తినుబండారాలు, శీతల పానీయాలు, కాపీ, టీ, ప్రూట్ జ్యూస్ లను ఈ వెండింగ్ మెషిన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కోయంబత్తూరు-బెంగుళూరు మధ్య నడిచే ఉదయ్ (UDAY ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి) ఎక్స్ ప్రెస్ లోని మూడు బోగీల్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వెండింగ్ మెషిన్ వద్ద వున్న టాబ్లెట్ తో కాఫీ, టీ సహా తమకు కావాల్సిన పదార్ధాలను ఎంపిక చేసుకుని వాటికి సరిపడా నగదు చెల్లించాలి. ప్రస్తుతం నగదు చెల్లింపుదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో వుంది. First ever food vending machine in running train installed in- Coimbatore - Bengaluru UDAY Express over Southern Railway pic.twitter.com/1C2ezhxNiT — Ministry of Railways (@RailMinIndia) June 9, 2018 -
అద్భుత ఫీచర్లు..బడ్జెట్ ధర: కొత్త ట్యాబ్
సాక్షి, న్యూఢిల్లీ: స్వైప్ టెక్నాలజీస్ బడ్జెట్ ధరలో ట్యాబ్‌ను లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ సామర్ధ్యం, 16జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ ప్రధాన ఫీచర్లుగా స్వైప్ స్లేట్ ప్రొ పేరుతో దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. రూ. 8499 ధరలో ఇది ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది. స్వైప్ స్లేట్ ప్రొ ఫీచర్లు 10.1 హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ మార్షమిల్లౌ 1.1 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 32 జీబా దాకా విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 2 ఎంపీ సెల్ఫీ కెమెరా మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లిప్‌కార్ట్ 5శాతం డిస్కౌంట్ అందిస్తోంది. -
ఆ ఆటో డ్రైవర్ రూటే సపరేటు..!
-
ఈ- క్రాప్ బుకింగ్ దాదాపు పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ చేపట్టిన ఈ– క్రాప్ బుకింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పలు మండలాలు వంద శాతం సర్వే పూర్తి చేయడం విశేషం. గ్రామం, సర్వే నెంబరు, రైతు వారీగా పంటల వివరాలను ట్యాబ్‌ల ద్వారా ఫొటో తీసి ఆన్లైన్లో అఫ్లోడ్ చేయాల్సి ఉంది. ఈ– క్రాప్ బుకింగ్ వల్ల కరువు ఏర్పడినపుడు రైతులు ఏ పంట సాగు చేసి ఉంటే ఆదే పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 5.72 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా ఇప్పటి వరకు 95.8 శాతం క్రాప్ బుకింగ్ పూర్తి చేశారు. కొన్ని మండలాల్లో వందశాతం పూర్తి చేయగా మిగతా వాటిలో మండలాల్లో 97 శాతం పూర్తి చేశారు. కొసిగి, కౌతాళం, చాగలమర్రి, కొలిమిగుండ్ల, దొర్నిపాడు, హలహర్వి, మద్దికెర, కల్లూరు తదితర మండలాలు కాస్త వెనుకబడి ఉన్నాయి. ట్యాబ్‌లు, ఏఈఓ, ఎంపీఈఓల కొరత కారణంగా సర్వేలో జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో ఈ–క్రాప్ బుకింగ్‌ను బట్టి పంట నష్టం అంచనా వేస్తారు. వారం రోజుల్లో ఖరీప్‌లో సాగు చేసిన అన్ని పంటల బుకింగ్‌ను వందశాతం పూర్తి చేయనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. -
కైజాల యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కైజాల యాప్‌ను ట్యాబ్‌ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సొమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కైజాల యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... కైజాల యాప్ ద్వారా ప్రజాసమస్యలు సత్వరం పరిష్కరించే వీలుందని తెలిపారు. జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నందున నివారణ చర్యలు యుద్ధప్రాతిపదిక చేపట్టాలని సూచించారు. సమావేశంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు. -
‘పల్స్’ దొరకలేదా..?
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. శుక్రవారం జిల్లాలో సర్వే ప్రారంభమైనా ఆశించిన స్పందన కాన రాలేదు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వివరాలు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని సమాచారం. మరికొన్ని గ్రామాల్లో ట్యాబ్‌లు మొరాయించాయి. దీంతో తొలిరోజు సమస్యలతోనే సరిపోయింది. పల్స్ సర్వేలో కులాల జాబితా గందరగోళంగా ఉండడంతో కాళింగ వర్గం వారు ఈ సర్వేను మొదట నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ ఆ సామాజిక వర్గ నేతలు స ర్వేను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కూడా. దీంతో తొలిరోజు వారు వివరాలిచ్చేందుకు అంగీకరించలేదు. కుల వివరాల్లో స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన తర్వాతే వివరాలు చెబుతామని వారు తేల్చి చెప్పారు. శుక్రవారం లావేరు మండలంలో ఉన్న బుడుమూరులో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు నమోదు నిలిపివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ట్యాబ్‌లతో కష్టాలు... ఇక సర్వేలో ట్యాబ్‌లు పెడుతున్న ఇబ్బందులు చెప్పనలవిగానివిగా ఉన్నాయి. జిల్లా కేంద్రం లో బాగానే పనిచేసిన ట్యాబ్‌లు గ్రామాల్లో మాత్రం పనిచేయడం లేదు. ఇప్పటి వరకు ట్యాబ్‌లకు రెండు వర్షన్లలో ప్రభుత్వం యాప్‌ను అందించింది. ఈ యాప్‌లో తొలుత 2.1 వెర్షన్ ఉంచగా అది పనిచేయలేదు. దీంతో ఈ నెల5న రాష్ట్ర ఉన్నతాధికారులు 2.2 వెర్షన్‌ను అందజేశారు. ఇది కూడా కొన్నిప్రాంతాల్లో పనిచేయడం లేదు. తొలిరోజున జిల్లాలో అన్ని మండలాల్లో, పురపాలక సంఘాల్లో 1342 మంది ఎన్యూమరేటర్లు వారి సహాయకులతో ట్యాబ్‌లతో క్షేత్ర స్థాయిలో సర్వేలు ప్రారంభించినా కేవలం 600లు మాత్రమే నమోదు జరిగాయి.శనివారం నుంచి కనీసం సగం గ్రామాల్లోనైనా 2.2 వెర్షన్ యాప్ ద్వారా సర్వే చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
పింఛన్ల అవినీతి జబ్బుకు ‘ట్యాబ్’లెట్!
కాకినాడ : ‘చచ్చినా వదలం’ అన్న ధోరణిలో మృతి చెందిన పింఛన్ లబ్ధిదారుల వేలిముద్రలూ వేసేసి సొమ్ము కైంకర్యం చేస్తున్న దళారులకు ‘ట్యాబ్’ల ద్వారా అధికారులు చెక్ పెట్టనున్నారు. పింఛన్ లబ్ధిదారుల వేలిముద్రలను ఆధార్‌తో అనుసంధానం చేసి నిర్ధారణ అయ్యాకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఇంతకాలం పెద్ద మొత్తంలో పింఛన్లు కైంకర్యం చేస్తున్న అక్రమార్కులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలోని 4 లక్షల 71వేల 588 మంది పింఛన్ లబ్ధిదారులకు ప్రతినెలా రూ.50కోట్ల పింఛన్లు నేరుగా పంపిణీ చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల సిబ్బంది, దళారులు, ఇటీవల కొత్తగా ఏర్పాటైన జన్మభూమి కమిటీలు కుమ్మక్కై పెద్దమొత్తంలో పింఛన్లు స్వాహా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ట్యాబ్‌ల ద్వారా పింఛన్ల పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనివల్ల అక్రమాలకు చెక్పడే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని నగరపాలక, పురపాలక సంఘల్లో ఒక్కోవార్డుకు ఒక్కో ట్యాబ్‌ను సమకూరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకూ వీటిని అందిస్తున్నారు. 750 జనాభా దాటిన గ్రామాలకు అదనపు ట్యాబ్‌లు సమకూరుస్తున్నారు. ఇలా మొత్తంగా జిల్లాకు 1526 ట్యాబ్‌లు చేరుకున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా వీటిని ఆయా పంపిణీ కేంద్రాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ట్యాబ్‌లకు ఏపీ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా ద్వారా ఆధార్ అనుసందానం, ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అవి ఆధార్‌తో సరిపోల్చుకున్నాకే పింఛన్ అందిస్తారు. -
హైటెక్ నారాయణ
నేటి ప్రపంచంతో పాటు దూసుకెళ్లాలంటే సాంకేతిక పరిజ్ఞానం తోడు అవసరమని చెప్పడానికి ఈ చిత్రం ఓ నిదర్శనం. తాను నమ్మిన సిద్ధాంతాలు.. విలువలను భుజానికి తగిలించుకుని.. నేటి తరం వారితో పాటుగా పయనానికి అన్నట్లు ఒకచేత్తో సెల్‌ఫోన్.. మరో చేత్తో ట్యాబ్ పట్టుకుని ముందడుగు వేస్తున్నారు సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ. కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో గురువారం నిర్వహించిన ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు సంస్మరణ సభకు వచ్చిన నారాయణను సాక్షి క్లిక్ మనిపించింది. -
విద్యార్థులందరికీ ట్యాబ్‌లు
ఉద్ధవ్‌ఠాక్రే ఎన్నికల హామీ సాక్షి, ముంబై: ఢిల్లీ ఆడమన్నట్లు ఆడే ప్రభుత్వం రాష్ట్రంలో వద్దని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ధులే జిల్లాలోని పారోలా రోడ్డుపైగల శివాజీ విగ్రహం వద్ద సోమవారం ఉద్ధవ్ ప్రచార సభ జరిగింది. ప్రచారానికి సోమవారం ఆఖరురోజు కావడంతో ఉద్ధవ్‌కు తగినంత సమయం దొరకలేదు. దీంతో శివాజీ విగ్రహం వద్ద జిల్లాలోని ఐదు శాసనసభ నియోజక వర్గాల సభ్యులకు మద్దతుగా అక్కడే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎగుమతులకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అందరం కలిసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని, అయితే ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన వి కావడంతో ఇక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉందని అన్నారు. శివసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులందరికి ట్యాబ్, మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, అందుకు జిల్లా ఆరోగ్య కేంద్రాలన్నింటిని అనుసంధానిస్తామని తెలిపారు. రైతులకు తగినన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.