
హైటెక్ నారాయణ
నేటి ప్రపంచంతో పాటు దూసుకెళ్లాలంటే సాంకేతిక పరిజ్ఞానం తోడు అవసరమని చెప్పడానికి ఈ చిత్రం ఓ నిదర్శనం. తాను నమ్మిన సిద్ధాంతాలు.. విలువలను భుజానికి తగిలించుకుని.. నేటి తరం వారితో పాటుగా పయనానికి అన్నట్లు ఒకచేత్తో సెల్‌ఫోన్.. మరో చేత్తో ట్యాబ్ పట్టుకుని ముందడుగు వేస్తున్నారు సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ. కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో గురువారం నిర్వహించిన ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు సంస్మరణ సభకు వచ్చిన నారాయణను సాక్షి క్లిక్ మనిపించింది.