సాక్షి,ముంబై: గాడ్జెట్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో 11 అంగుళాల టచ్ స్క్రీన్‌తో తన తొలి ప్రీమియం 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. పీ 11 అనే 5జీ ట్యాబ్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
ధర, లభ్యత
256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది. లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్‌లో అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల నాన్‌స్టాప్‌గా వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది.
లెనోవో ట్యాబ్ పీ11 5జీ స్పెసిఫికేషన్స్
క్వాల్కమ్ స్నాప్‌డడ్రాగన్ 750జీ ఎస్ఓసీ
ఆడ్రేనో 619 జీపీయూ
11 అంగుళాల 2కే ఐపీఎస్ టచ్‌స్క్రీన్
7700ఎంఏహెచ్ బ్యాటరీ
డివైజ్ స్లాట్ ద్వారా 5జీ సిమ్‌ని ఇన్‌సర్ట్ చేయడం ద్వారా 5G సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇంకా డస్ట్- వాటర్ రెసిస్టెన్స్ పీ11 5జీ ట్యాబ్‌లో 8ఎంపీ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12ఎంపీ రేర్ కెమెరా కూడా ఉంది. 4 జేబీఎల్ స్పీకర్లను జోడించింది.
Comments
Please login to add a commentAdd a comment