ఈ- క్రాప్ బుకింగ్ దాదాపు పూర్తి
Published Wed, Nov 9 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ చేపట్టిన ఈ– క్రాప్ బుకింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పలు మండలాలు వంద శాతం సర్వే పూర్తి చేయడం విశేషం. గ్రామం, సర్వే నెంబరు, రైతు వారీగా పంటల వివరాలను ట్యాబ్‌ల ద్వారా ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అఫ్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ– క్రాప్ బుకింగ్ వల్ల కరువు ఏర్పడినపుడు రైతులు ఏ పంట సాగు చేసి ఉంటే ఆదే పంటకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 5.72 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా ఇప్పటి వరకు 95.8 శాతం క్రాప్ బుకింగ్ పూర్తి చేశారు. కొన్ని మండలాల్లో వందశాతం పూర్తి చేయగా మిగతా వాటిలో మండలాల్లో 97 శాతం పూర్తి చేశారు. కొసిగి, కౌతాళం, చాగలమర్రి, కొలిమిగుండ్ల, దొర్నిపాడు, హలహర్వి, మద్దికెర, కల్లూరు తదితర మండలాలు కాస్త వెనుకబడి ఉన్నాయి. ట్యాబ్‌లు, ఏఈఓ, ఎంపీఈఓల కొరత కారణంగా సర్వేలో జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో ఈ–క్రాప్ బుకింగ్‌ను బట్టి పంట నష్టం అంచనా వేస్తారు. వారం రోజుల్లో ఖరీప్‌లో సాగు చేసిన అన్ని పంటల బుకింగ్‌ను వందశాతం పూర్తి చేయనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement