సాక్షి, న్యూఢిల్లీః రైలు ప్రయాణీకుల సౌకర్యార‍్ధం, రైల్వే శాఖ ఒక వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కాఫీ, టీ తదితర వాటికోసం పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్‌లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే శాఖ ట్విటర్‌లో ఒక వీడియోను షేర్ చేసింది.
ట్యాబ్లెట్ ఆధారంగా ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లు ప్రయాణికులకు సేవలను అందించనున్నాయని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. తద్వారా రైలు ప్రయాణికులు తమకు అవసరమైన బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటి తినుబండారాలు, శీతల పానీయాలు, కాపీ, టీ, ప్రూట్ జ్యూస్ లను ఈ వెండింగ్ మెషిన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కోయంబత్తూరు-బెంగుళూరు మధ్య నడిచే ఉదయ్ (UDAY ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి) ఎక్స్ ప్రెస్ లోని మూడు బోగీల్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వెండింగ్ మెషిన్ వద్ద వున్న టాబ్లెట్ తో కాఫీ, టీ సహా తమకు కావాల్సిన పదార్ధాలను ఎంపిక చేసుకుని వాటికి సరిపడా నగదు చెల్లించాలి. ప్రస్తుతం నగదు చెల్లింపుదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో వుంది.
First ever food vending machine in running train installed in- Coimbatore - Bengaluru UDAY Express over Southern Railway pic.twitter.com/1C2ezhxNiT
— Ministry of Railways (@RailMinIndia) June 9, 2018
Comments
Please login to add a commentAdd a comment