భువనేశ్వర్: ఒడిశాలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులతో ఉన్న 22 బోగీలు ఇంజిన్ లేకుండానే 13 కిలోమీటర్ల దూరం పరుగులు తీశాయి. ఈ ఘటనకు కారణమైన ఏడుగురు సిబ్బందిని రైల్వే శాఖ తాత్కాలికంగా విధుల నుంచి తప్పించింది. అహ్మదాబాద్–పూరి ఎక్స్‌ప్రెస్‌కు టిట్లాగఢ్ రైల్వే స్టేషన్‌లో ఇంజిన్‌ను మారుస్తున్న సమయంలో ఈ తప్పిదం చోటుచేసుకుంది.
టిట్లాగఢ్ నుంచి కేసింగ స్టేషన్ వైపునకు ఉన్న రైల్వే మార్గం కొంత వాలుగా ఉంటుందనీ, స్కిడ్ బ్రేక్‌లను సరిగ్గా వేయకపోవటం వల్ల రైలు బోగీలు కదిలాయని తూర్పు కోస్తా రైల్వే అధికారి ఆదివారం చెప్పారు. అనంతరం అప్రమత్తమైన సిబ్బంది పట్టాలపై రాళ్లు పెట్టి రైలును ఆపి పెను ప్రమాదాన్ని నివారించారని వెల్లడించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment