టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో రోజు రోజుకి కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అలాంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 'వన్‍ప్లస్' (OnePlus) తన మొదటి ట్యాబ్‍ను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కొత్త ట్యాబ్ విడుదలకు ముందే ధరల వివరాలు లీక్ అయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్‍ను కంపెనీ గత ఫిబ్రవరిలోనే పరిచయం చేసింది. అయితే ఆ సమయంలో కంపెనీ ఈ ప్రొడక్ట్ లాంచ్, ప్రైస్ వంటి వాటిని వెల్లడించలేదు. కంపెనీ అధికారిక ధరలను వెల్లడించకముందే ఈ ట్యాబ్ రూ. 23,099 దరిదాపుల్లో ఉంటుందని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది.
లీకైన ధరలను బట్టి చూస్తే ఈ ట్యాబ్ సరసమైన ధర వద్ద లభించే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తుంన్నారు. విడుదల సమయంలో కంపెనీ దీని ధరలను వెల్లడిస్తుంది.
(ఇదీ చదవండి: ఇప్పుడు పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!)
త్వరలో విడుదలకానున్న వన్‍ప్లస్ ప్యాడ్ 11.61 ఇంచెస్ 2.8K ఎల్‍సీడీ డిస్‍ప్లే కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ పొందుతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ వంటి వాటితో పాటు మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ కొత్త ట్యాబ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి 9,510mAh బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం నాలుగు స్పీకర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ట్యాబ్ కోసం ఇప్పటికే అమెరికా, యూకేలలో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. ఇండియాలో ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment